congress challenges to pm modi ప్రధానికి కాంగ్రెస్, అర్జీడీ ఛాలెంజ్.. మరి స్వీకరిస్తారా.?

Accept my challenge now tejashwi yadav dares pm modi

tejashwi yadav, tejashwi yadav trolls Pm modi, tejashwi yadav tweet on modi, jobs for youth, relief for farmers, tejashwi yadav on fitness challenge, modi accepts fitness challenge, pm modi fitness challenge, narendra modi, pm modi, virat kohli

Hours after Prime Minister Narendra Modi accepted Virat Kohli's fitness challenge, RJD leader Tejaswhi Yadav took to Twitter to accept his challenge of providing jobs to young and relief to farmers. Soon, Congress leader Randeep Surjewala joined in with a series of tweets

ప్రధానికి కాంగ్రెస్, అర్జీడీ ఛాలెంజ్.. మరి స్వీకరిస్తారా.?

Posted: 05/24/2018 02:07 PM IST
Accept my challenge now tejashwi yadav dares pm modi

అవకాశం ఎప్పుడు దొరుకుతుందా.? అంటూ ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విపక్షాలతో పాటు ఇటు ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై.. అది పాటిస్తున్న విధానాలను నిషితంగా గమనిస్తునూ వున్నాయి. ఈ క్రమంలో ఇవాళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్ ను ప్రధాని మోదీ స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనపై విపక్షాలు గళంవిప్పాయి. వ్యక్తిగా మోడీ ఫిట్ నెస్ గా వున్న ఛాలెంజ్ ను స్వీకరించడం కన్నా ముందుగా.. దేశ ప్రధానిగా తమ సవాళ్లను కూడా ప్రధాని స్వీకరించాలని డిమాండ్ చేశారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ప్రధాని స్వీకరించిన విరాట్ కోహ్లీ ఛాలెంజ్ పై స్పందిస్తూ... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఛాలెంజ్ ను మీరు స్వీకరించడం పట్ల ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలు లేవని... మరి, మా ఛాలెంజ్ ను కూడా స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. రైతులకు ఉపశమనం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, దళితులు, మైనార్టీల పట్ల హింస తదితర సవాళ్లను కూడా మీరు స్వీకరించాలని కోరుతున్నామని చెప్పారు. 'మా ఛాలెంజ్ ను స్వీకరిస్తారా మోదీ సార్?' అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించారు.

ఇక అ వెనువెంటనే కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విరాట్ సవాల్ ను స్వీకరించడంపై స్పందించింది. దేశ ప్రధానిగా ప్రధాని నరేంద్రమోడీ ముందు అనేక సవాళ్లు వున్నాయని, ఆయన వ్యక్తిగా సవాళ్లను ఎదుర్కోవడం కన్నా ప్రభుత్వపరంగా పాలనా విధానాలపై, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సవాళ్లను ఎదుర్కోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధు రణ్ దీప్ సూర్జేవాలా ప్రధాని సవాలుపై స్పందిస్తూ.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రధాని ఎదుట వున్న సవాళ్లను, నాలుగేళ్ల ముందు ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేశారు.

దేశంలో సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్న పెట్రోల్, డీజీల్ ధరలను ముందుగా కట్టడి చేసే సవాల్ ను ఎదుర్కోవాలని.. ఎందుకంటే గత నాలుగేళ్లుగా 11 సార్లు పెంచిన ఇంధన ధరలతో పది లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి ఎక్సైజ్ సుంకం పేరుతో దండుకున్నారని.. కనీసం ఇప్పుడైనా వాటిని కట్టడి చేయండని ఆయన అన్నారు. దీంతో పాటుగా ఏడాది యాభై లక్షల ఉద్యోగాలను కల్పిస్తానన్న మీ ఎన్నికల హామి మేరకు నిరుద్యోగులైన యువత గత నాలుగేళ్లుగా రెండు కోట్ల ఉద్యోగాల కోసం అశగా ఎదురుచూస్తున్నారని, వారి నుంచి కూడా సవాల్ ఎదుర్కోవాలని అయన ట్వీట్ లో పేర్కోన్నారు.

రైతులకు మెరుగైన మద్దతు ధరతో పాటు వారు పండించిన పంటకు అయిన ఖర్చులో యాభై శాతం పెట్టుబడిని కూడా ఇస్తామన్న సవాల్ ను ఎదర్కోవాలని, దీంతో పాటు విదేశాలలో వున్న రూ.80 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్వదేశానికి రప్పిస్తానని చేసిన హామీని, అవినీతి లేని ప్రభుత్వ పాలనను అందించాలని పేర్కోన్నారు. దీంతో పాటు ప్రభుత్వంలో అవినీతికి పాల్పడుతూ పలు కుంభకోణాలను పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించే సవాల్ ను ఎదుర్కోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పోరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాలు భారత భూభాగంలోకి చొచ్చుకోస్తూ.. జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్న సవాల్ ను ఎదుర్కోవాలని అన్నారు. ప్రచారం కోసం కాకుండా పాలనాపరమైన సవాళ్లను స్వీకరించాలని సూర్జీవాలా డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tejashwi yadav  Congress  Randeep Surjewala  Pm modi  fitness challenge  narendra modi  virat kohli  bihar  

Other Articles