pawan kalyan slams chandrababu AP govt మీ కిరాయి గుండాలను తరిమికొడతాం: పవన్

Pawan kalyan slams chandrababu ap govt

pawan kalyan, janasena, Pawan Kalyan tekkali bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan questioned Andhra Pradesh Government why is it in power when it is unable to solve problems in people in the state.

ITEMVIDEOS: ప్రజల కన్నీరు తుడవలేని అధికారమెందుకు.?

Posted: 05/23/2018 06:24 PM IST
Pawan kalyan slams chandrababu ap govt

సామాజిక రాజకీయ మార్పు కోసం.. ప్రజల సమస్యలను పరిష్కారించే ప్రభుత్వాన్ని అందించాలని, రాష్ట్రవాసుల అరోగ్యం పరిరక్షణ, ఉద్యోగ కల్పన, రైతాంగ సంక్షేమ పాలన కావాలంటే 2019లో జనసేన పార్టీకే ఓటు వేయాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. మీ ప్రేమ, అభిమానంతో నన్ను సీఎం, సీఎం అంటూ నినదిస్తే చాలదని.. జనసేన పార్టీ గురించి చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. తాను పదవి కోసమే, లేక డబ్బు కోసమే రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

నాలుగేళ్ల క్రితం బీజేపి, టీడీపీలకు ఓట్లు వేయమని అడిగానని, అయితే వారిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చని పక్షంలో తాను ప్రజల తరపున రోడ్డుపైకి వచ్చి నిలదీస్తానని కూడా చెప్పానని, అందుకనే ఇవాళ తిరుగుబాటు నేల, అన్యాయాలకు ఎదురోడ్డిన గడ్డ శ్రీకాకుళం నుంచి కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో వున్న పార్టీలను హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. బీజేపి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిందని, దీనిపై తాను పోరాటం చేస్తుంటే అడ్డుపడిన టీడీపీ.. హోదా సంజీవిని కాదని కూడా చెప్పిందని అన్నారు. ఇప్పుడు మాత్రం ధర్మాపోరాట దీక్షల పేరుతో కొత్తడ్రామాలకు తెరతీసున్నారని ఎద్దేవా చేశారు.

 ‘రెండు గంటల మీ ధర్మదీక్షకు 40 లక్షలు ఖర్చు చేస్తున్నారని.. కానీ ఉద్దానం కిడ్నీ బాధితులకు మాత్రం తాగునీరు అందించలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు ఇలా మాటమార్చుతాయని తనకు తెలియదని.. తెలిసివుంటే 2014లో కనీసం కొన్ని స్థానాలకైనా తాను పోటీ చేసి వుండేవాడినని పవన్ అవేదన వ్యక్తం చేశారు. సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ తాకట్టు పెట్టిందని పవన్ విమర్శించారు. ప్రజల కన్నీళ్లు తుడవలేని పార్టీలకు అధికారం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తే ఏం చేస్తారని అడిగితే తెలంగాణను చూపాల్సి వస్తుందని దుయ్యబట్టారు.

ప్రజావ్యతిరేక విధానాల వల్ల తెలంగాణలో టీడీపీ మట్టికొట్టుకుపోయిందని.. అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోని పక్షంలో ఇక్కడ కూడా తెలుగుదేశానికి అదే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని టీడీపీ తెలుసుకోవాలని సూచించారు. జనసేన కవాత్తు నిర్వహించకుండా టెక్కలిలో లారీలను అడ్డంగా పెట్టించారని పవన్ అరోపించారు. 'సరికొత్త మార్పు రావాలి. సరికొత్త రాజకీయ చైతన్యం రావాలి. యువతను తాను నమ్ముతున్నాను. 2019కు సరికొత్త రాజకీయ వ్యవస్థ అవసరం.  2019లో మనం అన్ని ప్రాంతాలలో పోటీ చేస్తున్నాం అని పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలు తీరాలన్నా, లేక అభివృద్దిలో పోటీపడాలన్ని ‘జనసేన’ వెన్నంటే ఉండండి ’ అంటూ పవన్ కోరారు.

తాను అన్నింటికీ తెగించిన తరువాతే రాజకీయాల్లోకి వచ్చానని, నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిన పవన్ కల్యాన్ చంద్రబాబుపై సంచలన అరోపణలు చేశారు. తాను పలాసలో వుండగా, రాత్రి వేళ విద్యుత్ సరఫరాను నిలిపేసి..  పదిహేను మంది కిరాయి రౌడీలను తనపైకి ఉసిగొల్పినంత మాత్రాన ఏం జరగదని, వారికి తాను భయపడే వ్యక్తిని కానని పవన్ కల్యాన్ అరోపించారు. తాము తలచుకుంటే మీ కిరాయి గుండాలను బట్టలిపించి తరమి తరమి కొడతామం.. ఖబడ్దార్ అంటూ పవన్ హెచ్చరించారు.

తాను ఇలాంటి తప్పుడు సంకేతాలకు, తప్పుడు వేషాలకు భయపడే వాడిని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెబుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి గారూ.. మీరు రౌడీలను, గూండాలను పంపితే, మేము సైనికుల స్ఫూర్తితో మీ కిరాయి గూండాలను బట్టలూడదీసి కొడతాం, తరిమి తరిమి కొడతామని అన్నారు. ఇలాంటి తప్పుడు సంకేతాలకి, తప్పుడు వేషాలకి భయపడే వాడు కాదు పవన్ కల్యాణ్ అని తేల్చిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  tekkali  srikakulam  porata yatra  bus yatra  andhra pradesh  politics  

Other Articles