Bandaru Dattatreya's son dies of heart attack బండారు ఇంట విషాదం.. దత్తాత్రేయకు పుత్రశోకం..

21 year old son of bjp mp bandaru dattatreya dies of heart attack

Bandaru Dattatreya, Former union minister, BJP MP, Secundrabad, Bandaru Vaishnav, cardiac arrest, Bandaru Dattatreya son, Bandaru Dattatreya son death, BJP leader Bandaru Dattatreya, Telangana

Twenty one-year-old son of former Union minister and Bharatiya Janata Party (BJP) MP Bandaru Dattatreya's son, Bandaru Vaishnav, died after suffering a heart attack.

బండారు ఇంట విషాదం.. దత్తాత్రేయకు పుత్రశోకం..

Posted: 05/23/2018 09:52 AM IST
21 year old son of bjp mp bandaru dattatreya dies of heart attack

కేంద్ర మాజీ మంత్రి, బీజేపి సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయకు పుత్రశోకం ఏర్పడింది. తన ఏకైక కుమారుడు వైష్ణవ్ ‌(21) ఆకస్మికంగా గుండెపోటుతో మృతిచెందడం ఆయన కుటుంబంలో విషాధాన్ని నింపింది. మంగళవారం రాత్రి 10.45కు వైష్ణవ్ గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాదులోని తన స్వగృహంలో భోజనం చేస్తుండగా వైష్ణవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు వెంటనే ముషీరాబాదులోని గురునానక్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

వైష్ణవ్‌ ఎంబీబీఎస్‌ మూడో ఏడాది చదువుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో షాక్ కు గురైన దత్తాత్రేయ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వైష్ణవ్‌ మృతదేహాన్ని బంధువుల సందర్శనార్థం స్వగృహంలో ఉంచారు. ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే వైష్ణవ్‌ ఇక లేడని తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అతడిని కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. వైష్ణవ్ తో సన్నిహిత్యం పెంచుకున్న పార్టీ నేతలు, శ్రేణులు కూడా ఆయన ఇక లేడన్న వార్తను జీర్ణంచుకోలేక పోతున్నారు. వైష్ణవ్ హఠాన్మరణం పట్ల సంతాపాలు వెల్లవెత్తుతున్నాయి.

చిన్నప్పటి నుంచి వైష్ణవ్ ను ఎత్తుకున్నామని, మా కళ్ల ముందు పెరిగిన పిల్లాడని.. అప్పుడే అతనికి నూరేళ్లు నిండిపోయాయా.. అంటూ దత్తాత్రేయకు అత్యంత సన్నిహిత కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి దత్తాత్రేయను పరామర్శించారు. బీజేపి ఎమ్మెల్యే లక్ష్మణ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జనసమితి వ్యవస్థాపకులు కోదండరామ్‌ తదితరులు దత్తాత్రేయ నివాసానికి చేరుకుని ఆయన్ని పరామర్శించారు.

బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణంపై తెలుగు రాష్ట్రాల మఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. వైష్ణవ్ చిన్న వయసులోనే కుటుంబానికి దూరం కావడం పెనువిషాదమన్నారు. ఎంబీబీఎస చేస్తూ భవిష్యత్ కు బాటలు వేసుకుంటున్న వైష్ణవ్ అకాల మరణానికి గురికావడం కలచి వేసిందన్నారు. ఒక్కగానొక్క కొడుకు ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని, దత్తాత్రేయ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandaru Vaishnav  Bandaru Dattatreya  Heart attack  BJP MP  Secundrabad  Telangana  

Other Articles