AirAsia India Offers Domestic Flight Tickets From Rs 999 ఎయిర్ ఏషియా బిగ్ సేల్ ఆఫర్: రూ.999కే అంతర్జాతీయ టికెట్లు..

Airasia s big sale offer international flight tickets start from rs 999

AirAsia, AirAsia flight offer, AirAsia flight tickets, AirAsia Sale, AirAsia new sale, AirAsia Big Sale, AirAsia Big Sale scheme, AirAsia domestic tickets, AirAsia international tickets,

AirAsia is offering overseas flight tickets at a starting all-inclusive price of Rs. 999 on select routes. AirAsia's 'Big Sale' offer is valid on travel from November 1, 2018 till August 13, 2019 and bookings are open till May 27, 2018,

ఎయిర్ ఏషియా బిగ్ సేల్ ఆఫర్: రూ.999కే అంతర్జాతీయ టికెట్లు..

Posted: 05/22/2018 02:08 PM IST
Airasia s big sale offer international flight tickets start from rs 999

చౌకధర విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇటే దేశీయంగా కొత్తగా కస్టమర్లను అకర్షించేందుకు సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. దేశీయంగా ఎంపిక చేసిన రూట్లలో కొత్తగా విమానయానం చేస్తున్న ప్యాసెంజర్లకు అన్ని చార్జీలు కలుపుకుని రూ.999కే ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆపర్ కింద ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఈ నెల 27వ తేదీలోగా తమ టికెట్లను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్ట్ 13 వరకు ప్రయాణించే అవకాశం కల్పించింది.

అయితే ఈ ఆఫర్ కింద టికెట్లు పొందాలనుకునే వారు ఖచ్చితంగా ఎయిర్ ఏషియా డాట్ కామ్ వెబ్ సైట్ నుంచే టిక్కెట్లు పొందాలన్న నిబంధనను పెట్టిన సంస్థ.. ఈ ఆపర్ కింద బుక్ చేసుకున్న టికెట్లు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తీసుకునే అవకాశం లేదని తెలిపింది. ఈ ఆపర్ కింద కేవలం కొన్ని సీట్లు మాత్రమే అందుబాటులో వున్నాయిని కూడా స్పష్టం చేసింది. ఈ చార్జీలు కేవలం ఒక్క వైపు ప్రయాణినికే వర్తిస్తాయని కూడా ఎయిర్ లైన్స్ సంస్థ పేర్కోంది. కోచ్చి నుంచి బెంగుళూరుకు మాత్రమే రూ.999 ధరను అపర్ చేసిన ఎయిర్ ఏషియా.. మిగిలిన రూట్లలోనూ తక్కువ ధరలకు విమానయాన అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ తగ్గింపు ధరలు కూడా కేవలం ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే వర్తించనున్నాయని సంస్థ తెలిపింది.

ఇక దీనికి తోడు విదేశీయానం చేయాలనుకునే వారికి కూడా ఎయిర్ ఏషియా బ్రహ్మాండమైన అఫర్ ను ప్రకటించింది. ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా తగ్గింపు ధరలలను వర్తింపజేసింది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్ కు ఒకవైపు ప్రయాణానికి రూ.999గా నిర్ణయించింది. అదే విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ కు వెళ్లాలంటే టికెట్ ధర రూ.1,999గా ఉంది. హైదరాబాద్ నుంచి అయితే రూ.4,999. ఇలా ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి అనే దాని ప్రకారం రేట్లు మారిపోతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  domestic offer  international offer  new passengers  Rs.999 offer  aviation industry  

Other Articles