AP Express catches fire near Gwalior station ఏపీ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం.. బి6. బి7 బోగీల్లో మంటలు..

Vizag bound ap express catches fire near gwalior station

andhra pradesh express fire, AP AC Express fire, ap express, ap express rail, train fire at Gwalior, ap express, fire, ac coches, birlanagar railway station, madhy apradesh, gwalior, andhra pradesh

A Delhi-Vishakhapatnam bound train from New Delhi caught fire today near Birlanagar station in Madhya Pradesh's Gwalior city while returning to vizag.

ITEMVIDEOS: ఏపీ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం.. బి6. బి7 బోగీల్లో మంటలు..

Posted: 05/21/2018 01:21 PM IST
Vizag bound ap express catches fire near gwalior station

ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రమాదం సంభించింది.  ఢిల్లీ నుంచి విశాఖపట్టణం తిరుగు ప్రయాణంలో రైలులో మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో హుటాహుటిన స్పందించిన రైల్వే భద్రాతాధికారులు వెంటనే అగ్నిమాపక దళాలకు ఫోన్ చేసి నాలుగు శఖటాలను రంగంలోకి దింపి మంటలను అర్పివేయిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఏ ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రయాణికుల సామాగ్రితో పాటు పలు బోగీలు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈరోజు ఉదయం ఆరుగంటలకు ఢిల్లీలో ఏపీ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. గ్వాలియర్ ప్రాంతానికి సమీపిస్తున్న సయమంలో ఒక్కసారిగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. బీ5 ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించిన సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు రైలును వెంటనే నిలిపివేశారు. తక్షణ చర్యలను అధికారులు ప్రారంభించారు. ఈ సంఘటనతో భయపడిపోయిన ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ రెండు బోగీల్లో మంటలు వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఏసీ బోగీలు రెండూ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో ప్రయాణికులెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles