petrol, diesel prices soars to all time high రికార్డు స్థాయికి ఇంధన ధరలు.. వాహనదారులు బెంబేలు..

Petrol diesel prices hiked for 8th day to new highs

Petrol price today, Diesel price today, Petrol, diesel, Petrol price all time high, diesel price all time high, crude oil rates, excise duty, value added tax

Petrol and diesel prices today were increased in the range of 33-34 paise per litre and 25-27 paise per litre across Delhi, Kolkata, Mumbai and Chennai and all metro cities across the country, that marked fresh all-time highs of petrol and diesel prices.

రికార్డు స్థాయికి ఇంధన ధరలు.. వాహనదారులు బెంబేలు..

Posted: 05/21/2018 11:57 AM IST
Petrol diesel prices hiked for 8th day to new highs

దేశచరిత్రలోనే ఇంధన ధరలు భగ్గమంటున్నాయి. వాహనదారులతో పాటు సగటు సామాన్య మధ్యతరగతి వారిపై ధరల భారం మెండుగా పడుతుంది. కర్నాటక ఎన్నికలతో 19 రోజుల పాటు స్తబ్దంగా ఉన్న ఇ:ధన ధరలు.. అనంతరం అకాశానంటేలా పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెరిగిన ధరలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేశాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 33 పైసలు పెరిగి రూ. 76.24కు చేరింది. గతేడాది జూన్‌ నుంచి రోజువారీ ధరలు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇది మునుపెన్నడూ ఎరుగని ధర కావడం గమనార్హం. అదేవిధంగా లీటర్‌ డీజిల్‌ ధర అధికంగా 26 పైసలు పెరిగి రూ. 67.57కు చేరుకుని  అకస్మాత్తుగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

అయితే, దేశంలోని మెట్రోనగరాలు, రాష్ట్ర రాజధానుల్లో ఉండే ధరలతో పోల్చుకుంటే దేశరాజధానిలోని ధరలు మాత్రం తక్కువగా ఉన్నాయి. దేశంలోని పలు నగరాల్లో పెరిగిన పెట్రోల ధరలు ఈ విధంగా ఉన్నాయి. అధిక స్థానిక పన్నులతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 84.07గా ఉంది. కోల్‌కతాలో రూ. 79.91, చెన్నైలో రూ. 79.13, భోపాల్‌లో రూ. 81.83, పాట్నాలో రూ. 81.73, శ్రీనగర్‌లో రూ. 80.35గా ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో మాత్రం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.76 కు చేరింది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.82.8కి చేరుకుంది. గోవా రాజధాని పనాజీలో మాత్రం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 70.26తో అతితక్కువగా ఉన్నది. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

ఇక డీజిల్ విషయానికొస్తే.. దేశ చరిత్రలోనే గరిష్టంగా రూ.67.57కి పెరిగింది. హైదరాబాదులో లీటర్ డీజిల్ ధర రూ.73.45 కాగా.. త్రివేండ్రంలో రూ.73.45, రాయ్ పూర్ రూ.72.96, గాంధీనగర్ రూ.72.63, భువనేశ్వర్ రూ.72.43గా ఉంది. ముంబైలో రూ.71.94, కోల్ కతా, చెన్నైల్లో రూ.71.32గా ఉంది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అడ్డగోలుగా పన్నులు బాదుతూ పోవడం వల్లే పెట్రోల్, డీజిల్ రేట్లు అంతకంతకూ పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

Crude Oil Price

కాగా డీజిల్ ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డీజిల్ పెరగడంతో రవాణా చార్జీలు పెరిగి తద్వారా నిత్యావసర సరుకుల ధరలపై వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు వుండటంతో.. మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న ధరలపై భగ్గుమంటున్నారు. కూడ్ర్ అయిల్ తగ్గిన క్రమంలో కేంద్రం పెంచిన తొమ్మిది రూపాయల ఎక్సైజ్ ధరనైనా తగ్గించాలని మధ్యతరగలి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇక ధరలు పెరిగిన ప్రతీసారి ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే సన్నాహాలు జరుగుతున్నాయ్ అంటూ ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వ్యాఖ్యానిస్తున్నారే తప్ప.. ఇప్పటి వరకు అందుకు తగ్గ చర్యలు మాత్రం కనీసం అడుగు కూడా ముందుకు పడలేదని మధ్యతరగతి ప్రజలు మండిపడ్డుతున్నారు. ధరలు తగ్గిన క్రమంలో రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుని సుంకాన్ని పెంచిన కేంద్రం.. ధరలు పెరిగిన తరుణంలో మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని వాహనదారులు కూడా కేంద్రంపై తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol price today  Diesel price today  Petrol  diesel  crude oil price  excise duty  value added tax  

Other Articles