Abusive son has no right to mother's home: Bombay high court తల్లి ఇంట్లోకి వుండాలంటే..: బాంబే హైకోర్టు సంచలన తీర్పు..

Abusive son has no right to mother s home bombay high court

Bombay high court, south Mumbai, Mother, son, legacy, Malabar Hill flat, Justice Shahrukh Kathawalla, Nepean Sea Road, Prima facie, legal affairs

A son who ill-treats and assaults his mother cannot claim the right to enter her house, the Bombay high court has said.

తల్లి ఇంట్లోకి వుండాలంటే..: బాంబే హైకోర్టు సంచలన తీర్పు..

Posted: 05/21/2018 09:49 AM IST
Abusive son has no right to mother s home bombay high court

తల్లి ఇంట్లో వుండాలనే పుత్రరత్నాలకు, అత్తగారిని సరిగా చూసుకోని కొడళ్లకు చెంపపెట్టులాంటి సంచలన తీర్పును వెలువరించింది బాంబే హైకోర్టు. తల్లిదండ్రుల ఆస్తిపైనే కన్నేసి వారి యోగక్షేమాలు పట్టించుకోకుండా, వేధించే కుమారులుకు అసలు ఆమె ఇంట్లోకి ప్రవేశించే హక్కు లేదని బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది. తన ఆస్తినంత కూతరు, అల్లుడికి పెడుతుందని అరోపిస్తూ న్యాయస్థానాన్ని అశ్రయించిన ఓ కొడుకు, కోడలు, మనవడికి న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది.

72 ఏళ్ల తల్లి తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ దక్షిణ ముంబైకి చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. తల్లిని సరిగా చూసుకోని కుమారుడు ఆ ఇంట్లోకి ప్రవేశించే హక్కును కోల్పోతాడని జస్టిస్ షారూఖ్ కథవాలా పేర్కొన్నారు. తల్లిని సరిగా చూసుకోని, ఆమెను తీవ్రంగా వేధించి, కొన్నిసార్లు దాడులకు సైతం దిగే కుమారులకు ఆమె ఇంట్లోకి వెళ్లే హక్కు లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

ఈ కేసులో భాగంగా న్యాయమూర్తి ఎదుట హాజరైన వైద్యురాలైన బాధిత వృద్ధురాలు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కుమారుడు తనను చిత్ర హింసలు పెడుతున్నాడని, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని తెలిపింది. ఇక ఈ వేధింపులు భరించలేనని మొరపెట్టుకుంది. వాదనలు విన్న కోర్టు ఆ ఇంటిని ఖాళీ చేయాలని, ఆ ఇంట్లో ఉన్న వారి వస్తువులను హైకోర్టు కమిషనర్ సమక్షంలో తీసుకెళ్లాలని తీర్పు చెప్పింది. ఇకపై కుమారుడి నుంచి ఎటువంటి బాధలు ఉండవని బాధిత వృద్ధురాలికి కోర్టు హామీ ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles