RSS-BJP should learn lesson: Rahul Gandhi బీజేపి ఆరెస్సెస్ లకు ఇది గుణపాఠం: రాహుల్ గాంధీ

Rss bjp should learn lesson rahul gandhi

yeddyurappa, rahul gandhi, PM Modi, amit shah, floor test, congress, JDS, deva gowda, karnataka, politics

Congress chief Rahul Gandhi launched a strong attack on Prime Minister Narendra Modi, accusing him of authorising “buying off” MLAs and “disrespecting” institutions.

బీజేపి ఆరెస్సెస్ లకు ఇది గుణపాఠం: రాహుల్ గాంధీ

Posted: 05/19/2018 06:59 PM IST
Rss bjp should learn lesson rahul gandhi

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రే బీజేఫి అగ్రనేతలను ఎమ్మెల్యేలను కొనండని పురమాయించారని అరోపించారు. అవినీతి గురించి ఉపన్యాసాలు చెప్పే మోడీ అలా ఎలా చెప్పగలరని తీవ్రస్తాయిలో మండిపడ్డారు. ప్రధాని.. తాను  దేశ ప్రజల కన్నా, సుప్రీంకోర్టు కన్నా, వ్యవస్థల కన్నా గొప్ప కాదన్న విషయాన్ని గ్రహించాలని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.

ప్రధాని దేశానికి నాయకత్వం వహించాలని, దేశంలోని వ్యవస్థలను గౌరవించాలని అన్నారు. కర్ణాటక ప్రజల గొంతును తాము పరిరక్షించామన్నారు. బీజేపీకి కర్ణాటక ప్రజల మద్దతు లేదన్నారు. జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. ఓట్లను పరిశీలించినా, జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కన్నా బీజేపీకి ఓట్లు చాలా తక్కువగా వచ్చాయన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి, సమన్వయంతో బీజేపీని ఓడించాలన్నారు. ఇక జాతీయగీతం పట్లు తమకు అపారగౌరవం వుందని చెప్పే బీజేపి నేతలు ఓ వైపు కర్ణాటక అసెంబ్లీలో జనగణమన గీతం అలపిస్తుండగానే వెళ్లిపోయారని ఆయన తప్పుబట్టారు.

గోవా, మణిపూర్‌లోనూ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఎరచూపారని, కర్ణాటకలో ఈ  ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. ఇందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరిచిన తీర్పు దోహదపడిందని అన్నారు. కర్ణాటక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, దేవెగౌడ, ఆ పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎలాగానా బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ ఎన్నో ప్రలోభాలకు పాల్పడినట్టు ఫోన్ సంభాషణలు, టేపులు చెబుతున్నాయని, దీనినిబట్టే దేశంలో అవినీతిని నిర్మూలిస్తామని మోదీ చెప్పే మాటలు పచ్చి అబద్దాలని మరోసారి రుజువైందని రాహుల్ అన్నారు. కర్ణాటకలో తాజా పరిణామం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు ఒక గుణపాఠం అని, ప్రజల అభీష్టం కూడా తాజా ఫలితంతో రుజువైదంని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yeddyurappa  rahul gandhi  PM Modi  amit shah  floor test  congress  JDS  deva gowda  karnataka  politics  

Other Articles