Yeddyurappa resigns as CM, gives emotional speech సీఎం పదవికి యడ్డీ రాజీనామా.. బీజేపికి తొలి దక్షిణాది దెబ్బ..

Yeddyurappa resigns as cm gives emotional speech

karnataka assembly floor test, bs yeddyurappa, resigns, resign, floor test, no majarity, emotional speech, vajubhai wala, yeddyurappa audio tape, yeddyurappa resign, new cm resigns, yeddyurappa cm, audio tape, poaching mla, sri ramulu, congress, JDS, priyanka chaturvedi, karnataka assembly, congress, JDS, kumaraswamy, revanna, siddaramaiah, karnataka, politics

After an emotional speech in the Assembly, BS Yeddyurappa said that he will resign as the chief minister of Karnataka. He will meet the governor after the Assembly session and submit his resignation.

సీఎం పదవికి యడ్డీ రాజీనామా.. బీజేపికి తొలి దక్షిణాది దెబ్బ..

Posted: 05/19/2018 04:26 PM IST
Yeddyurappa resigns as cm gives emotional speech

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి పార్టీకి.. అందునా ప్రధాని మోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు తొలిసారిగా షాక్ తగిలింది. కర్ణాటక విధాన సౌధలో బలాన్ని నిరూపించుకునే క్రమంతో ఉద్వేగానికి గురైన యడ్యూరప్ప.. భావోద్వేగంతో ప్రసంగించిన అనంతరం తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. బలాన్ని నిరూపించుకునేందుకు ముందుగానే రాజీనామా చేసిన ఆయన ఈ సందర్భంగా తాను తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తగిన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోలేకపోయానని, అవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ.. తాను ప్రధాని నరేంద్రమోడీ కోసం రానున్న లోక్ సభ ఎన్నికలలో ఏకంగా 28 స్థానాలను బీజేపి గెలిచేట్టు దోహదపడతానని అన్నారు. అంతేకాదు ఆ తరువాత రానున్న విధాన సౌధ ఎన్నికలలో ఏకంగా 150 స్థానాలను గెలిచి మరీ ప్రధాని మోడీకి కానుకగా ఇస్తానని చెప్పారు. ప్రజాస్వామ్యంపై తమపార్టీ బీజేపికి పూర్తి విశ్వాసం వుందని అయన అసెంబ్లీలో అన్నారు. అయితే సంఖ్యాబలం లేనందువల్ల తాను రాజ్యాంగ పరంగా గవర్నర్ కు రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపానలకు వ్యతిరేకంగా జనం తీర్పును ఇచ్చారని, కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కూడా ప్రజలు అదరించలేదని అన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్నా కర్ణాటకకు ప్రధాని మోడీ ఎంతో చేశారని అయన పేర్కోన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో వేల మంది రైతులు అసువులుబాసారని ఆయన అందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు, కార్మీకులకు జరిగింది శూన్యమని పైగా వారికి అన్యాయం మాత్రం జరిగిందని ఆయన విమర్శించారు.

కార్ణటకలో ప్రజలతో కలసి తిరిగిన తాను ప్రజల కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నానని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని రైతాంగానికి లక్ష రూపాయల మేర రుణమాఫీ చేయాలని తాను భావించానని అయితే తన రాజీనామా ఆ పని చేయనీయడం లేదన్నారు. అలాగే రాష్ట్రంలోని వితంతు, వృద్దాప్య పింఛన్లు కూడా పెంచాలని తాను భావించినట్లు చెప్పారు. తాను ముఖ్యమంత్రిని కాకపోయినంత మాత్రన తనకు వచ్చే నష్టమేమి లేదని ఆయన తన అక్రందనను వెళ్లగక్కారు. అయితే తన ప్రభుత్వం వచ్చేంటే అభివృద్దికి బాటలు వేసేవాడినని అశాభావం వ్యక్తం చేశారు. తన జీవితం మొత్తం ఒక అగ్నిపరీక్షలా సాగిందని యడ్యూరప్ప తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles