Yedyurappa will resign before trust vote, claims బలపరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా.?

Yedyurappa will resign before trust vote claims

karnataka assembly floor test, bs yeddyurappa, yeddyurappa audio tape, yeddyurappa resign, new cm resigns, yeddyurappa cm, audio tape, poaching mla, sri ramulu, congress, JDS, priyanka chaturvedi, karnataka assembly, congress, JDS, kumaraswamy, revanna, siddaramaiah, karnataka, politics

Amid speculation that BS Yeddyurappa may resign if the BJP's last minute assessment show they are still short of numbers, NDTV reported that the chief minister has sought a appointment with governor right after his speech.

బలపరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా.?

Posted: 05/19/2018 03:19 PM IST
Yedyurappa will resign before trust vote claims

దేశ అత్యున్నత న్యాయస్థానం అదేశాల నేపథ్యంలో బల నిరూపణ పరీక్ష సిద్దమైన యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకోనున్నారా..? అంటే అవుననే కన్నడనాట స్థానిక, జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మరికొన్ని గంటల వ్యవధిలో బలపరీక్ష నిరూపించుకోవాల్సిన యడ్యూరప్ప.. తన సంచలన నిర్ణయంతో కన్నడ రాజకీయాలు మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. యావత్ దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బలనిరూపణ ప్రక్రియ ఏటు దారితీస్తుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.

అయితే యడ్యూరప్ప సంచలన నిర్ణయం కేవలం సానుభూతి క్రమంలో తనకు పరిచయమైన ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేయడం కోసమే చివరి ప్రయత్నంగా కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ యడ్యూరప్ప తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటని అంటారా.? సభలో బలం నిరూపించుకోలేని పరిస్థితి వస్తే.. యడ్యూరప్ప అంతకుముందే తన సీఎం పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి కర్ణాటక, జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

యడ్యూరప్ప రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. విశ్వాస పరీక్షకు ముందే సభలో మాట్లాడి యడ్యూరప్ప గవర్నర్ ను కలుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే యడ్యూరప్ప తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న గాలి జనార్దన్‌రెడ్డి, నేడు యడ్యూరప్ప పేరుతో ప్రలోభాల టేపులను కాంగ్రెస్‌ విడుదల చేసిన నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రిగా వుండి జైలుకెళ్లి ప్రతిష్టను దిగజార్చుకున్న యడ్యూరప్ప.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు మాట్లాడిన టేపు బయటకురావడంతో కుంగిపోయారని, ఇక దీనికి తోడు తనకు బలం లేదని.. దానిని ఎలా నిరూపించుకుంటామని అలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో అవమానాన్ని ఎదుర్కోనే కంటే ముందుగానే రాజీనామా చేయడం మంచిదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది.

దీంతో యడ్యూరప్పను శాంతపర్చే పనిలో బీజేపి శ్రేణులు నిమగ్నమయ్యారు. అయితే అసెంబ్లీలో తన ప్రసంగం తరువాత తాను రాజీనామా చేస్తానని యడ్యూరప్ప పార్టీ శ్రేణులకు వెల్లడించినట్లు సమాచారం. ఏకంగా జాతీయ బీజేపి అధ్యక్షుడు అమిత్ షాతో కూడా యడ్యూరప్పను ఫోన్ లో మాట్లాడించారు. కాగా అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవద్దని పార్టీ అధిష్టానం అదేశాలను జారీ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, యడ్యూరప్ప రాజీనామా వార్తలు కేవలం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మాత్రమేని పలువురు రాజకీయ విశ్లేషకులు కోట్టిపారేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yeddyurappa  resign  audio tape  poaching mla  sri ramulu  congress  JDS  priyanka chaturvedi  karnataka  politics  

Other Articles