Congress Release Audio of Yeddyurappa 'Trying to Poach' BC Patil సీఎం సాగించిన బేరసారాలు అడియో వింటారా.. ఇదిగో..

Congress releases audio tape of yeddyurappa allegedly trying to poach cong mla

karnataka assembly floor test, bs yeddyurappa, yeddyurappa audio tape, yeddyurappa corruption, bjp offers 100 crore, yeddyurappa cm, audio tape, poaching mla, sri ramulu, congress, JDS, priyanka chaturvedi, karnataka assembly, congress, JDS, kumaraswamy, revanna, siddaramaiah, karnataka, politics

In an explosive development hours before the crucial trust vote in the Karnataka assembly, the Congress has released an audio tape in which chief minister BS Yeddyurappa is allegedly trying to lure Congress MLA BC Patil.

సీఎం సాగించిన బేరసారాలు అడియో వింటారా.. ఇదిగో..

Posted: 05/19/2018 02:38 PM IST
Congress releases audio tape of yeddyurappa allegedly trying to poach cong mla

దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక విధాన సౌధలో.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్పను బలపరీక్ష నిరూపించుకోవాలని అదేశించిన నేపథ్యంలో ఆయన తన గూటికి చేరే ఇతర పార్టీల పక్షుల కోసం ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఇదివరకే అరోపించిన కాంగ్రెస్.. తాజాగా ఇందుకు సంబంధించిన మరో అడియో టేప్ ను విడుదల చేసింది. దీంతో ఇది కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారింది.

మంత్రి పదవులతో పాటు వంద, రెండెందల కోట్ల రూపాయలను ఇస్తామని బీజేపి నుంచి తమ ఎమ్మెల్యేలకు ఆఫర్లు వస్తున్నాయని అరోపించిన కాంగ్రెస్.. అందుకు సంబంధించిన అడియో టేపుల తర్వాత.. తాజాగా కర్ణాటక నూతన ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సంబంధించిన అడియో టేపును కూడా విడుదల చేసింది. తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవితో పాటు ఐదేళ్ల పాటు ఏం కావాలంటే అది సమకూరుస్తామని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే బిసి పాటిల్ తో ఫోన్ లో సంబాషించిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది.

కొచ్చి వెళ్తే ఇక నీతో మేము అందుబాటులోకి రాము అంతా ముగిసిపోతుంది. అందుకనే ఏదో ఒక కారణం చెప్పి బస్సు దిగి వెనక్కి వచ్చయ్.. ఏ విషయాన్ని ఐదు నిమిషాల్లో శ్రీరాములుతో చెప్పేసయ్ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీసీ పాటిల్ తో యడ్యూరప్ప మాట్లాడినట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆడియో టేపును కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీసీ పాటిల్, యడ్యూరప్ప మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది..

బీసీ పాటిల్‌ : మేము బస్సులో వెళ్తున్నాం..

యడ్యూరప్ప : కొచ్చి వెళ్లకు.. ఇక్కడికి వచ్చేయ్‌.. మంత్రి పదవి ఇస్తాం. మాట్లాడుదాం. వెనక్కి వచ్చేయ్.

బీసీ పాటిల్ : ముందే చెప్పి ఉంటే బాగుండేది.. ఇప్పుడు బస్సులో ఉన్నాం.

యడ్యూరప్ప : ఏదో కారణం చెప్పి వెనక్కి వచ్చేయ్‌. ఇంట్లో వాళ్లకు సమస్య ఉందని చెప్పి వెనక్కి వచ్చేయ్‌.

బీసీ పాటిల్ : ఇక ముందు నా పొజిషన్ ఏంటీ?

యడ్యూరప్ప : నువ్వు మంత్రి అవుతావు.

బీసీ పాటిల్ : నాతోపాటు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు.

యడ్యూరప్ప : నీ వెంట ఉన్నవాళ్లను పిలుచుకొని రా.. నాపై విశ్వాసం ఉంది కదా?. ఒకసారి నువ్వు కొచ్చి వెళ్తే ఇక దొరకవు. ఇప్పుడు ఏం చేస్తావ్ చెప్పు.

బీసీ పాటిల్ : ఐదు నిమిషాల్లో మీకు ఫోన్ చేసి చెబుతా.

యడ్యూరప్ప : శ్రీరాములుకు ఫోన్ చేసి చెప్పు.

యడ్యూరప్ప ఈ సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కొనున్నారు. బలపరీక్షలో నెగ్గితీరుతానని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేస్తుండగా.. అసెంబ్లీలో సంఖ్యా బలం తమకే ఉందని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి థీమాగా వుంది. మరి ఎవరు నెగ్గుతారోనన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yeddyurappa  audio tape  poaching mla  sri ramulu  congress  JDS  priyanka chaturvedi  karnataka  politics  

Other Articles