Telangana EAMCET 2018 results declared తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..

Telangana eamcet 2018 results declared

ts eamcet results,Telangana EAMCET results 2018,Telangana EAMCET Results,Telangana EAMCET 2018 results today,telangana eamcet 2018 results,Kadiyam Srihari, JNTUH, Engineering, Agriculture, Pharma

The TS EAMCET 2018 results have been declared on the official website eamcet.tsche.ac.in. Ayyapu Venkata Phani Vamsinath of Hyderabad secures top rank in engineering with 95.72%. while Perigela Namratha of Kurnool secures top rank in agriculture and pharmacy with 93.38%.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. జులై 15 నుంచే తరగతులు..

Posted: 05/19/2018 12:48 PM IST
Telangana eamcet 2018 results declared

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసెట్ 2018 ఫలితాలను ఇవాళ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విడుదల చేశారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షలు తొలిసారిగా కంప్యూటర్ అధారితంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో ఇంజినీరింగ్ విభాగంలో 78.24శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 1,19 వేల 270 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా, పోరుగునున్న తెలుగు రాష్ట్రం అంధ్రప్రదేశ్ నుంచి సుమారు 17 వేల 41 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

సచివాలయంలో ఫలితాలను విడుదల చేసిన ఢిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవాళ వివరాలను మీడియాకు తెలుపుతూ.. మొత్తంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు సంబంధించి 1 47 వేల 957 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు రిజిస్టర్ చేసుకున్నారని, అయితే వారిలో 136305 మంది పరీక్షలను రాశారని తెలిపారు. కాగా పరీక్షలు రాసిన విద్యార్థులలో 1లక్ష 06 వేల 646మంది విద్యార్థులు అర్హత పొందారు. అలాగే ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ సహా సంబంధిత స్ట్రీమ్ ఇంజనీరింగ్ లో 73,106 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారిని కడియం తెలిపారు.

కాగా వీరిలో పరీక్షలు రాసిన వారు 66 వేల 858 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 90.72శాతంతో 60 వేల 651 మంది అర్హత పొందారు. అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఇవాళ కేవలం 94,592 మందికి మాత్రమే ర్యాంకులు జారీ చేస్తున్నామని చెప్పారు. అర్హత పోందిన మిగిలిన విద్యార్థులు క్వాలిఫయింగ్ పరీక్ష అయిన ఇంటర్లో కొందరు ఫైయిల్ అయ్యారని, వారు సప్లిమెంటరీ పరీక్షలు రాసారని వారు అందులో ఉత్తీర్ణత సాధించిన తరువాతే ర్యాంకులు జారి చేస్తామని చెప్పారు. ఇక మరోవైపు సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు కూడా వెలువడాల్సి వుందని కడియం అన్నారు.

కౌన్సిలింగ్ ను పూర్తి చేసి పస్ట్ రౌండ్ అడ్మీషన్లను చేపట్టాలని ఈ నెల 18నే నోటిఫికేషన్ విడుదల చేశామని ఆయన చెప్పారు. పస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఈ నెల 25న ప్రారంభమై వచ్చే నెల 8న ముగుస్తుందని, ఇందులో భాగంగానే సీట్ల కేటాయింపులు కూడా జరుగుతాయని కడియం చెప్పారు. ఇక రెండో రౌండ్ కౌన్సిలింగ్ జూలైలో మొదటి వారంలో జరుగుతుందని చెప్పారు. ఇక ఈ సారి తరగతులను పక్షం రోజులు ముందుగానే ప్రారంభించాలని.. అంటే జులై 16 నుంచి ప్రారంభించాలని కూడా నిర్ణయించామని కడియం శ్రీహరి చెప్పారు.

Click Below Links For TS Eamcet Results:

Eamcet.tsche.ac.in

Results.manabadi.co.in

Results.eenadu.net

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles