setback to bjp in supreme court సుప్రీంకోర్టులో యడ్యూరప్ప ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

Setback to yeddyurappa government in supreme court

supreme court, congress mlas, mukhul rothagni, abhishek manu singhvi, karnataka assembly, assembly speaker, speaker election, congress mlas, jds mlas, BS Yeddyurappa, governor, vajubhai wala, Congress, BJP, JDS, Kumara Swamy, hyderabad, kochi, Siddaramaiah, PM Modi, Amit shah, karnataka, politics

setback to yeddyurappa government in Supreme Court, as the apex court directed floor test in Karnataka Assembly tomarrow at 4pm.

సుప్రీంకోర్టులో యడ్యూరప్ప ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

Posted: 05/18/2018 11:53 AM IST
Setback to yeddyurappa government in supreme court

కర్ణాటకలోని కొత్తగా కొలువుదీరిన యడ్యూరప్ప ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన గవర్నర్.. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా యడ్యూరప్పతో ప్రమాణస్వీకారం చేయించి.. పక్షం రోజుల వ్యవధిలో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా అదేశించిన క్రమంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు సంచలన అదేశాలు జారీ చేసింది.

ఇవాళ కర్ణాటక రాజకీయాలపై దాఖలైన పిటీషన్ ను విచారించిన ధర్మాసనం ఇరువర్గాలకు చెందిన వాదనలను వినింది. అటు బలనిరూపణ విషయంతో అంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే నియామకం విషయంలోనూ దాఖలైన పిటీషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా ఎవరి బలమెంత అన్నది అసెంబ్లీలో నిరూపించాలని వ్యాఖ్యనించిన న్యాయస్థానం.. రేపు సాయంత్రం నాలుగు గంటలకు బలనిరూపణ చేయాలని అదేశించింది. బలనిరూపణకు సమ్మతించని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుపై సమీక్ష నిర్వహిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

ఇక అంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే నియామకం కూడా ఇప్పుడే చేపట్టరాదని అదేశాలను వెలువరించిన న్యాయస్థానం.. ముఖ్యమంత్రి హోదాలో యడ్యూరప్ప ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేదని, అన్నీ బలనిరూపణ జరిగిన తరువాతే చేపట్టాలని అదేశించింది. సుప్రీం తాజా అదేశాలను కాంగ్రెస్ స్వాగతించింది. శనివారం సాయంత్రం బలనిరూపణకు తాము సిద్దమని ప్రకటించింది.

కాగా అధికార బీజేపి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహత్గీ తాము బలనిరూపణకు సిద్దమని అయితే కనీసం వారం రోజుల పాటైనా సమయాన్ని ఇవ్వాలని కోరారు. అయితే ఆయన అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. రేపు సాయంత్రమే బలాన్ని నిరూపించుకోవాలని అదేశించింది. లేని పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుపై సమీక్షించాల్సిన అవసముందని కూడా చెప్పింది, రేపు బలనిరూపణకు మీకున్నఅభ్యంతరాలు ఏంటని అని ప్రశ్నించడంతో బీజేపి తరపు న్యాయవాది నిమ్మకుండిపోయారు.

 బలపరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ముకుల్ రోహత్గీ కోరారు. దీన్ని కూడా దర్మాసనం తిరస్కరించింది. బలనిరూపణ ఎలా చేయాలనన్నది అసెంబ్లీలోని ప్రోటెం స్పీకర్ నిర్ణయిస్తారని న్యాయస్థానం సూచించింది. ఆయన ఇష్టప్రకారమే ముసా పద్దతిలో చేతులను పైకి ఎత్తడం ద్వారా ఎమ్మెల్యేలు తమ మద్దతును తెలపాలని... ఎమ్మెల్యేల సంఖ్యను ప్రొటెం స్పీకర్ లెక్కించాలని స్పష్టం చేసింది. దీంతో కర్ణాటకలో కొలువుదీరిన యడ్యూరప్ప కోత్త ప్రభుత్వం బలాన్ని ఎలా నిరూపించుకుంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  congress mlas  jds mlas  BS Yeddyurappa  Congress  BJP  JDS  karnataka  politics  

Other Articles