5 Congress MLA's in touch with BJP ‘చేయ్యి’జారిన ఐదుగురు ఎమ్మెల్యేలు.. బీజేపితో టచ్..

Karnataka elections 5 congress mla s in touch with bjp

karnataka assembly elections, congress mlas, Siddaramaiah, PM Modi, BS Yeddyurappa, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

BJP are poaching our MLAs, we know that. Every day there is a lot of pressure. But it not so easy because two parties have the necessary number. People are watching this says congress leader shiva kumar

‘చేయ్యి’జారిన 5గురు ఎమ్మెల్యేలు.. బీజేపితో టచ్.. యడ్డీ ధీమా

Posted: 05/16/2018 11:30 AM IST
Karnataka elections 5 congress mla s in touch with bjp

కర్ణాటకలో ఓటరు తీర్పుతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు అధికారం కోసం మాత్రం ఎత్తులు, పైఎత్తులు వేస్తూన్నారు. దీంతో కర్ణాటకలో రాజకీయాల్లో హైడ్రామాలకు వేదకగా మారుతున్నాయి. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒక్కటి అన్న ఓటరు తీర్పు నేపథ్యంలో అధికారం అందుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో రాజకీయాలు క్షణక్షణం మారిపోతోంది. 104 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపికి అధికారం దక్కనీయకుండా కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ బీజేపికి మద్దతు తెలిపడంతో బీజేపి బలం 105కు చేరకుంది.

ఇందుకు అనుగూణంగా తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదని భావిస్తున్న కాంగ్రెస్.. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామినే సీఎంగా కొనసాగించేందుకు కూడా సిద్దమైంది. ఇలా కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) కూటమి ఏర్పడి 24గంటలు గడవకముందే కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ బి. పాటిల్‌, నగేంద్ర(కూడ్లగి‌), ఆనంద్‌ సింగ్‌(విజయ నగర)తో పాటు భీమా నాయక్‌, అమేర్‌ గౌడ నాయక్ లు అజ్ఞాతంలోకి జారుకున్నారని తెలుస్తుంది.

అయితే వారిని అన్వేషించే పనిలో భాగంగా అధిష్టానం చర్యలు చేపట్టింది. కాగా వీరు బీజేపితో టచ్ లో వున్నారని, వారి మద్దతు ధీమాతోనే బీజేపి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నధమైందని తెలుస్తుంది. ఈ క్రమంలో రేపు (గురువారం) ఉదయం 11.30 గంటలకు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేస్తారని బీజేపి ఎమ్మెల్యే శ్రీరాములు ప్రకటించడం.. రాజ్ భవన్ కు వెళ్లిన బీజేపి పక్ష నేత యడ్యూరప్ప కూడా గవర్నర్ ను కలిసిన తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ అదే విషయాన్ని వ్యక్తపర్చారు.

అయితే ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారనే వార్తలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. ఎన్నికలలో గెలిచిన తమ ఎమ్మెల్యేలందరూ తమకు అందుబాటులో ఉన్నారని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేల ఆచూకీ తెలియడం లేదని ఎవరో గిట్టని వాళ్లు వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే విశ్వాసంతో ఉన్నాం. కాసేపట్లో అందదరితోనూ సమావేశం అవుతామని ఆయన చెప్పినా.. కాంగ్రెస్ పక్ష సమావేశానికి మాత్రం ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress mlas  Siddaramaiah  Yeddyurappa  Congress  BJP  JDS  Kumara Swamy  karnataka  politics  

Other Articles