bus creates ruckus at jubilee bus station హోటల్ లోకి చోచ్చుకెళ్లిన బస్సు, బీభత్సం..

Bus creates ruckus at jubilee bus station

bus ramps into tiffin center, bus ramps into hotel, bus ruckus at jubilee hills bus station, jubilee hills bus station, secundrabad, maredpally police, tiffin center, tsrtc bus, crime

TS RTC bus creates ruckus at jubilee bus station, ramps into tiffin centre injuring hotel owner and an customer. maredpally police filed case against driver and cleaner of the bus.

హైదరాబాద్ లో బస్సు బీభత్సం.. హోటల్ లోకి చోచ్చుకెళ్లిన వైనం

Posted: 05/16/2018 10:56 AM IST
Bus creates ruckus at jubilee bus station

దరాబాద్ నగరంలో బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ కాకుండా క్లీనర్ బస్సును నడిపి.. ఇద్దరిని ప్రాణాలతో చెలగాడమాడాడు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లోకి దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి హోటల్లోకి చొచ్చుకెళ్లింది. పికెట్ డిపోకు చెందిన బస్సు.. నల్గొండ నుంచి జేబీఎస్ కు వచ్చింది. బస్సును స్టేషన్లో నిలిపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. అదుపుతప్పి పక్కనే ఉన్న గణేష్ టిఫిన్ సెంటర్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో టిఫిన్ మాస్టర్ రాజన్ తో పాటు.. హోటల్ లో భోజనం చేస్తున్న నిజామాబాద్ కు చెందిన ప్రయాణికుడు కన్నయ్యపై బస్సు దూసుకెళ్ళింది.

ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు.. 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన సమాచారం అందుకున్న మారేడుపల్లి పోలీసులు హుటాహుటిన వచ్చి.. కేసు నమోదు చేసుకున్నారు. బస్సును డ్రైవర్ కాకుండా క్లీనర్ నడిపించడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెలుగుచూసింది. అంతేకాకుండా బస్సు నిలిపేందుకు క్లీనర్ బ్రేక్ బదులుగా యాక్సిలరేటర్ ను వినియోగించడంతోనే ప్రమాదం సంభవించిందని కూడా తేల్చారు. దీంతో క్లీనర్ హరితో బస్సు డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jubilee hills bus station  secundrabad  maredpally police  tiffin center  tsrtc bus  crime  

Other Articles