Karnataka-Mlas-in-dailama-after-election-result కర్ణాటకలో ఎమ్మెల్యేలు ఎగిరిపోతున్నారా?

Karnataka mlas in dailama after election result

Assembly elections in Karnataka, Karnataka news, Karnataka 2018 results, Karnataka Assembly elections, Karnataka updates, Karnataka new, Karnataka elections, Karnataka 2018 elections, Karnataka Assembly results, Congress, BJP, JDS

Karnataka mla in dailama after election result

కర్ణాటకలో ఎమ్మెల్యేలు ఎగిరిపోతున్నారా?

Posted: 05/15/2018 06:22 PM IST
Karnataka mlas in dailama after election result

(Image source from: Tupaki.com)

కర్ణాటక ఎన్నికల ఫలితాలు అందరికీ ఆశ్చర్యాన్ని... గెలిచిన ఎమ్మెల్యేలకు ధీమానిచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి క్లీయర్ మెజార్టీ రాకపోవడం.. బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోవడం.. జేడీయూలో రాజకీయాలు ప్రారంభం కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తక్కువ సంఖ్యాబలం అవసరం ఉండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేడీయూ ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వర్గంలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను బీజేపీ గాలం నుండి కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను రిసార్టులు, ఫాంహౌజ్ లకు తరలించి... బలనిరూపణ వరకు కాపాడుకునే ప్రయత్నిస్తోంది. కాగా జేడీయూకు తమ మద్దతును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరమేశ్వర్ లిఖిత పూర్వకంగా రాసిచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయం తర్వాత వెంటనే బలనిరూపణ చేసి.. వీలైనంత వేగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని రెండు వర్గాలు ఉవ్విళ్లూరుతున్నాయి.

 
 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka elections  BJP  Congress  JDS  

Other Articles