Fake poll with unrelated BBC link predicts BJP win in Karnataka కర్ణాటకలో ఫేక్ న్యూస్ తో గట్టెక్కేందుకు బీజేపి ప్రయత్నం

Fake opinion poll with bbc logo says bjp will win in karnataka

karnataka assembly elections, BBC survey, fake survey news, Siddaramaiah, #AnswerMaadiModi, PM Modi, BS Yeddyurappa, Janardhan Reddy, Amit Shah, Rahul Gandhi, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

BBC denounced a fake poll doing the rounds on social media which had claimed that the media corporation had predicted that BJP will win 135 seats in the Karnataka Assembly elections.

కర్ణాటక ఎన్నికలు: ఫేక్ న్యూస్ తో గట్టెక్కేందుకు బీజేపి ప్రయత్నం

Posted: 05/08/2018 08:20 PM IST
Fake opinion poll with bbc logo says bjp will win in karnataka

కర్ణాటకలో ఏ పార్టీకి అధికారం రాదని, హంగ్ తప్పదని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి.. ఇక ఇటీవలే వెల్లడించిన సీ4 సంస్థ కాంగ్రెస్ కు మెజారీటీ వస్తుందని, హంగ్ ఏర్పడదన్న నేపథ్యంలో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్న బీజేపి తప్పుడు సర్వేలకు, దొంగ లెక్కలకు తెరతీసి.. చేయని సంస్థలు సర్వే చేశాయని మరీ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నాయి. మరో నాలుగు రోజుల వ్యవధిలో ఎన్నికలు జరుగుతున్నాయన్న సమయంలో అన్ని పార్టీలు విజయంపై విశ్వాసాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచార సమరాంగనమంలో మునిగి తేలుతున్న క్రమంలో సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకునే బీజేపి పలు తప్పుడు ప్రచారాలకు కూడా నాంది పలికింది. ఇదే తప్పు ఇతర పార్టీలు చేసివుంటూ విచారణ జరిపించి మరీ కటకటాల్లోకి నెట్టే ప్రభుత్వం.. తమ గూటికి చెందిన పక్షులను ఎన్ని తప్పులను చేసినా తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తుంది.

ఈ క్రమంలో ఇటీవల బీబీసీ పేరిట ఓ ఫేక్‌ న్యూస్‌ హల్‌ చల్‌ చేసింది. బీజేపీ 135 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్‌కి కేవలం 35 సీట్లే దక్కుతాయని, ఇక జేడీఎస్‌కి 45, ఇతరులకి 19 సీట్లు దక్కుతాయని అందులో పేర్కొన్నారు. నిజానికి కర్ణాటక అసెంబ్లీ సీట్లు 224 మాత్రమే. అయితే, పైన పేర్కొన్న వివరాల ప్రకారం 135..45..35..19 మొత్తం కలిపి 234 సీట్లు అవుతున్నాయి. దీనిపై స్పందించిన బీబీసీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే అంటూ తమ సంస్థ పేరిట వాట్సప్‌లో ఓ ఫేక్‌న్యూస్‌ ప్రచారం అవుతోందని, అది బీసీసీ నుంచి వచ్చిన న్యూస్‌ కాదని, అసలు తాము ఇండియాలో ప్రీ-ఎలక్షన్స్ సర్వే చేయలేదని ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ ఫేస్‌న్యూస్‌ జన్‌ కీ బాత్‌ పేరిట బీబీసీ కర్ణాటక ఎన్నికలపై సర్వే నిర్వహించినట్లు ప్రచారం అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles