dachepally rape accused commited suicide దాచేపల్లి అత్యాచార నిందితుడు సుబయ్య ఆత్మహ్యత

Dachepally rape accused subbaiah commited suicide

subbaiah, suicide, rape case accused, amaralingeshwara swamy temple, rape, gang rape, 9 yr old raped in dachepally, 9 yr old raped in guntur, 9 yr old raped in andhra pradesh, 9 yr old raped by rickshaw puller, Guntur, Rape, Minor girl raped, Andhra Pradesh, Protests, Girl raped in Guntur, crime

After police run began behind him, dachepally rape accused subbaiah had commited suicide nearby amaralingeshwara swamy temple

దాచేపల్లి అత్యాచార నిందితుడు సుబయ్య ఆత్మహ్యత

Posted: 05/04/2018 12:31 PM IST
Dachepally rape accused subbaiah commited suicide

రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లి అత్యాచార ఘటన కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదర్కొంటూ.. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య పాల్పడ్డాడు. నిన్ననే తన కుటుంబసభ్యులకు, బంధువలకు ఈ మేరకు సమాచారం ఇచ్చిన నిందితుడు సుబ్బయ్య కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడతానని సమాచారం అందించాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచరం చేసిన పరారైన నిందితుడు.. ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తుంది.

ఈ అత్యాచారం ఘటన వెలుగులోకి రావడంతో.. స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అందోళనకారులు రాత్రి నుంచి రోడ్లపైనే వుండా రాస్తారోకో చేశారు. నిన్న స్థానికంగా బంద్ కూడా నిర్వహించారు. నిందితుడి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో వున్న నిందితుడు సుబయ్యను గాలించేందుకు 17 బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో అణువణువూ పరిశీలించారు.

అయితే, నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారమందింది. దైదా దగ్గర ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అమరలింగేశ్వర దేవాలయం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు ఘటనాస్థలికి బయలుదేరారు. దాచేపల్లిలో నిన్నటి ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : subbaiah  suicide  rape case accused  Guntur  Rape  Minor girl  Protests  dachepally  Andhra Pradesh  crime  

Other Articles

Today on Telugu Wishesh