Actor Vivekh trolled over sexist remark on Twitter హస్యనటుడిపై నెట్ జనుల విమర్శలు

Actor vivekh slammed by fans over sexist remark on twitter

Kollywood actor, comedian, Vivek, sense of humour, social responsibility, awareness. Twitter, students, boys, work, girls, kitchen, actor troll

Actor Vivekh wished his fans an enjoyable summer vacation by telling the girls to spend time in the kitchen with their mothers.

హస్యనటుడు వివేక్ పై నెట్ జనుల విమర్శలు

Posted: 05/04/2018 09:21 AM IST
Actor vivekh slammed by fans over sexist remark on twitter

ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్‌ పై నెట్ జనులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్‌ ఇందుకు కారణం అవుతుంది. కతువా, ఉన్నావ్ వంటి ఘటనల నేపథ్యంలో ఉత్తరాధి బీజేపి నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినట్లు వివేక్ చేసన ట్వీట్ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. బీజేపి నేతల తరహాలోనే నటుడు వివేక్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నెట్ జనులు మండిపడుతున్నారు.

వేసవి నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెద్దఎత్తున్న ఆగ్రహం పెల్లుబిక్కుతుంది. ఆయన చేసిన ట్వీట్ సారంశం ఏమిటంటే.. 'ప్రియమైన విద్యార్థులారా.. వేసవి వచ్చేసింది' అంటూ ఆయన పిల్లలకు కొన్ని సూచనలు చేశాడు. సెలవులను ఆస్వాదించాలని, ఆటలాడిన తరువాత నీళ్లు ఎక్కువగా తాగండని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది.. ఆ తరువాత ఆడ పిల్లలూ వంటగదిలో మీ అమ్మకు సాయంగా ఉండండి అని, వంట నేర్చుకోవాలని ఆయన సూచించడం విమర్శలకు దారి తీస్తుంది.

అక్కడితో అగని వివేక్ ఇక మగ పిల్లలు తమ తండ్రి పని ప్రదేశానికి వెళ్లి, కుటుంబం కోసం ఆయన ఎలా పనిచేస్తున్నారో చూడండని, బలంగా ఉండండని పేర్కొన్నాడు. దీంతో ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆడపిల్లలేమో వంట నేర్చుకోవాలి, మగ పిల్లలేమో ఆఫీస్‌కి వెళ్లాలా? అని మండిపడుతున్నారు. ఆడపిల్లలు అంతరిక్షయానంలోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నారని, మళ్లీ వంటింటి కుందేళ్లు కావాలా? అని మరికొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood actor  comedian  Vivek  sense of humour  Twitter  troll  

Other Articles