UP minister’s Dalit outreach backfires మంత్రిపై నెట్ జనుల ఫైర్.. ఇదేనా మీ నీతి, నిజాయితీ..?

Up minister suresh rana in a soup over dinner at dalit man s house

Suresh Rana, yogi adityanath, dalit outreach, narendra modi, uttar pradesh minister suresh rana, uma bharti, dalit outreach news, dalit suresh rana, uttar pradesh, politics

Suresh Rana, uttar pradesh minister, had dinner at the house Rajnish Kumar, who belongs to the Dalit community. but media reports said that the minister brought his own food, water and cutlery to the man’s house. The pictures have gone viral on social media.

మంత్రిపై నెట్ జనుల ఫైర్.. ఇదేనా మీ నీతి, నిజాయితీ..?

Posted: 05/03/2018 01:03 PM IST
Up minister suresh rana in a soup over dinner at dalit man s house

కేంద్ర, రాష్ట్రాల్లో సొంత ప్రభుత్వం వున్నా తమ స్థితిగతులు మారలేదని, కనీసం తాము పార్లమెంటు సభ్యులమన్న గౌరవం, మర్యాద కూడా తమకు ప్రభుత్వాల నుంచి లభించడం లేదని.. అంగలార్చుతూ ఉత్తరప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యులు బహిరంగంగా విమర్శలు చేసి.. యోగీ అదిథ్యనాథ్ ప్రభుత్వంతో పాటు కేంద్రం ప్రభుత్వంపై తమ అక్రోశాన్ని వెళ్లగక్కారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన అధిష్టానం.. వారి అభ్యున్నతికి పథకాలను అందించాల్సింది పోయి.. వారి ఇళ్లలో బోజనం చేసే కార్యక్రమాలకు తెరలేపింది. దళితులను తమకు అనుకూలంగా మార్చుకునే కార్యక్రమాన్ని చేయాలని కూడా సూచించింది.

దీంతో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మరో మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. ప్రచారంలో భాగంగా దళితుడి ఇంటికి వెళ్లిన మంత్రి హోటల్ నుంచి తెచ్చుకున్న భోజనాన్ని లాగించేసి వెళ్లిపోయారు. దీనిపై దళితుడు రజనీశ్ కుమార్ వివరాలు వెళ్లడించారు. తమ కుటుంబసభ్యులందరూ బంధువుల ఇంటికి వెళ్లడంతో తాను రాత్రి 9 గంటలకు స్థానిక రెస్టారెంటు నుంచి బోజనం తెచ్చుకుని తిని నిద్రలోకి జారుకున్నానని, అయితే రాత్రి పదకొండు గంటలకు తమ ఇరుగుపోరుగువారు తలుపు తట్టడంతో లేచానని, అయితే వారు మంత్రి సురేశ్ రాణా తమ ఇంట బోజనానికి వచ్చారని తెలిపారని చెప్పాడు.

మంత్రికి బోజనం పెట్టే అలోచనలో తాను వుండగానే.. మంత్రితో పాటు వచ్చిన అనుచరగణం.. వారితో పాటు భోజనం తెచ్చుకున్నారని, మినరల్ వాటర్ బాటిళ్లు కూడా వెంట తెచ్చుకోవడంతో తాను విస్మయానికి గురయ్యానని చెప్పాడు. ఆహారం నుంచి నీళ్లు, ప్లేట్లు, గ్లాసుల వరకు అన్నింటినీ వారు తమతోపాటు తెచ్చుకున్నారని.. మంత్రి పక్కన పార్టీ నేతలు కూర్చోని బోజనం చేసి వెళ్లిపోయారని కనీసం తనను మంత్రి పక్కన కూర్చోనీయకుండా చేశారని అవేదన వ్యక్తం చేశారు. హోటల్ నుంచి తెచ్చుకున్న బోజనాన్నివారి నేతలతో కలసి తమ ఇంట్లో తినేసిన మంత్రి ఫొటోలకు ఫోజులిచ్చి మరీ  సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై నెట్ జనులు తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపి నేతలు మాటలు ఒకలా.. వుంటాయన్నది మరోమారు ఈ మంత్రివర్యుల చేష్టలతో రూడీ అయ్యిందని నెట్ జనులు విమర్శిస్తున్నారు. బీజేపి నేతలు నీతి, నిజాయితీ అని ఇచ్చే లెక్చర్లు ప్రజల కోసమే కానీ వారి మాత్రం వాటిని అమలు చేయరని ఇదే వారి నీతి, నిజాయితీ అంటూ మరికొందరు విమర్శలు ఎక్కుపెట్టారు. ఫోటోల కోసం దళితుల ఇంట్లో బోజనాలు చేయడం.. అందుకు హోటల్ నుంచి బోజనం తెచ్చుకోవడం ఎందుకని మరికోందరు ప్రశ్నిస్తున్నారు. దళితుల ఓట్లు కావాలి కానీ.. బోజనం మాత్రం వద్దా.? అంటూ మరికోందరు నిలదీస్తున్నారు.

అయితే ఈ క్రమంలో బీజేపి సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కొందరు బీజేపి నేతలు తాము దళితుల ఇంట బోజనానికి వెళ్లడం.. శ్రీరాముడు శబరిని కరుణించినట్లని ప్రచారం చేసుకుంటున్న క్రమంలో.. ఉమాభారతి మాత్రం తాను దళితుల ఇళ్లలో బోజనం చేసినంత మాత్రాన వారు పరిశుద్దులు అవుతారని ఎలా అనుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులను తమ ఇంటికి పిలిచి తన స్వహస్తాలతో వంట చేసి వడ్డిస్తే తానకు సంతృప్తి అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Rana  yogi adityanath  dalit outreach  narendra modi  uttar pradesh  politics  

Other Articles