Nirmala Sitharaman convoy comes under fire కేంద్ర రక్షణ శాఖా మంత్రికి చేధు అనుభవం..

Dmk workers hurl stones slippers at nirmala sitharaman s car

Nirmala Sitharaman, Cauvery Management Board, DMK workers, tamil nadu, Karnataka, nirmala sitharaman car attacked, Narendra Modi

Defence Minister Nirmala Sitharaman's car came under attack from a group of DMK workers, who pelted it with stones, threw slippers and showed black flags, condemning the centre for not forming the Cauvery Management Board.

కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ కు చేధు అనుభవం..

Posted: 05/03/2018 12:09 PM IST
Dmk workers hurl stones slippers at nirmala sitharaman s car

కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు చేధు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని రామ్ నాథపురం పార్దీబనూర్ జంక్షన్ వద్ద కేంద్ర మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న అందోళనకారులు అమె కారుపై రాళ్లు, చెప్పులు, విసిరి నల్లజెండాలను ప్రదర్శించారు. అమె కారుకు అడ్డంగా వెళ్లిన అందోళనకారులు సుమారు అరగంట పాటు నానా హంగామా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం 'గ్రామ్ స్వరాజ్ అభియోన్' అమలును సమీక్షించేందుకు అక్కడకు వెళ్లిన నిర్మలా సీతారామన్‌ వస్తున్నారన్న సమాచారంతో డీఎంకే కార్యకర్తలు కావాలనే ఈ రచ్చను సృష్టించారని బీజేపి వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

కాగా, కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను వెంటనే అమలు చేయాలని తమిళనాడులోని ప్రజాసంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా గత రెండు నెలలుగా అందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బోర్డు ఏర్పాటు చేస్తే.. తమకు ప్రతికూలంగా మారుతుందని కేంద్రం ఈ విషయంలో నాన్చివేత ధోరణిని అవలంభిస్తున్న విషయం కూడా పాఠకులకు విధతమే.

అయితే కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర సర్కారు తీరును నిరసిస్తూ..  డీఎంకే కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను ముందుకు రాకుండా అదుపు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. జంక్షన్‌ వద్ద డీఎంకే ఆందోళనకారులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వివాదానికి కూడా దిగారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి అందోళనకారులను చెదరగొట్టడంతో పాటు క్రీయాశీలక నేతలను అదుపులోకి తీసుకోవడంతో.. కేంద్రమంత్రి పయనం సాగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles