Parents responsible for rape, says UP BJP MLA తమ గూటి పక్షి కోసమేనా.? ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Parents responsible for incidents of rape says mla surendra singh

Ballia, BJP, Kathua, Kuldeep Singh Sengar, Narendra Modi, Surendra Singh, Unnao, Uttar Pradesh, crime

Wading into the debate on violence against women and minor girls once again, Uttar Pradesh's ruling BJP legislator Surendra Singh has said parents are responsible for the increasing incidents of rape and should not let their children roam around freely.

తమ గూటి పక్షి కోసమేనా.? ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 05/02/2018 11:46 AM IST
Parents responsible for incidents of rape says mla surendra singh

మహిళలు, బాలికల అత్యాచారాలపై ఉత్తరప్రదేశ్ లోని బైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితులనే అత్యాచారాలకు బాధ్యులను చేస్తూ.. ఇంకా మాట్లాడితే వారిని కన్న తల్లిదండ్రులను కూడా కారణమని ఆయన నోరు పారేసుకున్నారు. అమ్మాయిలు చేతిలో సెల్ ఫోన్లు పట్టుకోవడం కూడా అత్యాచారాలకు కారణంగా చెప్పుకోచ్చాడు. ఇక వారిని అలా రోడ్ల మీద వదిలేస్తే అత్యాచారాలు జరక్కుండా ఎలా ఉంటాయని ఎదరు ప్రశ్నించారు. ఇంతకీ ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేశారా..? అంటే తమ గూటికి చెందిన ఎమ్మెల్యేను వెనకేసుకు వచ్చేందుకని సమాచారం.

ప్రధాన మంత్రి పార్టీ నేతలకు ఇకపై అందరు నేతలు తమనోటిని అదుపులో పెట్టుకోవాలని గత నెల చివరివారంలో సూచించిన కొన్ని రోజుల తరువాతే.. పార్టీ అధినేత గీసిన లక్ష్మణ రేఖను దాటిన ఈ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రని శూర్పనఖ అంటూ వివిదాస్పద వ్యాఖ్యలు చేసి.. విపక్ష కాంగ్రెస్ ను రావణుడితో పాల్చారు. ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలు ఎలా వున్నాయో కనీసం చూసుకోని ఈయన.. పశ్చిమ బెంగాల్ లో శాంతిభద్రతలు క్షీణించాయని అందుకు కారణమైన ముఖ్యమంత్రి మమతపై నోరుపారేసుకున్నాడు.

ఇక తాజాగా.. ఉన్నావ్ ఘటనలో తమ గూటికి చెందిన పక్షైన బీజేపి ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ 15 ఏళ్ల దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారన్న అరోపణలపై పెద్దఎత్తున్న దుమారం రేగిన తరువాత.. బాధితురాలి తండ్రి లాకప్ డెత్ అయిన తరువాత కానీ స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అతనిపై కేసు నమోదు చేసి సీబిఐకి అప్పగించిన నేపథ్యంలో.. సురేంద్ర సింగ్ ఆయనను వెనకేసుకువస్తూ అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో అగని ఆయన ముగ్గురు పిల్లల తల్లిపై ఎవరైనా అత్యాచారం చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు.

పిల్లలను స్వేచ్ఛగా వదిలేయడం వల్లే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన దీనింతటికీ పిల్లల తల్లిదండ్రులే కారణమని దుమారం రేపారు. 15 ఏళ్ల లోపు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని, వారికి స్వేచ్ఛ ఇవ్వకూడదని అన్నారు. అలాగే సెల్‌ఫోన్లు కూడా వారికి ఇవ్వొద్దని హితవు పలికారు. పిల్లలను తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహిళలపై బీజేపీకి ఉన్న గౌరవానికి ఇది ప్రత్యక్ష నిదర్శమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. రేపిస్టులకు బీజేపీ కొమ్ముకాస్తోందని విమర్శిస్తున్నాయి. ఇక నెట్ జనులు సురేంద్రసింగ్ వ్యాఖ్యలపై తీవ్రస్తాయిలో మండిపడుతున్నారు. కుల్ దీప్ సింగ్ ను అడిగితే ముగ్గురి పిల్లల తల్లిపై సామూహిక అత్యాచారం ఎందుకు చేస్తారో చెబుతారని వ్యంగ్య కామెంట్లు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చేదాకా బీజేపి నేతలు బేటీ అంటూ.. అధికారంలోకి రాగానే బ్యూటీ అంటున్నారని మరికోందరు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles