hyderabad traffic police tweet goes viral on social media నెట్టింట్లో హైదరాబాద్ పోలీసుల ట్వీట్ వైరల్..

Hyderabad traffic police tweet goes viral on social media

hyderabad traffic police, tweet, biker photo, pending challans, hyderabad traffic police tweets goes viral, hyderabad cops tweet viral, viral news, social media, hyderabad, krishna reddy

hyderabad traffic police tweets a photo of a biker with challans pending on the same bike saying sir, we never let u die, and see that u live like a real men, this post goes viral on social media

నెట్టింట్లో హైదరాబాద్ పోలీసుల ట్వీట్ వైరల్..

Posted: 05/01/2018 09:30 AM IST
Hyderabad traffic police tweet goes viral on social media

నగర రోడ్లపై ఇకపై అడ్డదిడ్డంగా వెళ్లినా, లేక రాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తూ సాగిపోవాలన్న ఇక కుదిరేపని కాదు. ఎందుకంటే ఇకపై వాహనాదారులపై నిఘానేత్రలు నిత్యం వెంటాడుతూనే వుంటాయి. హై స్పీడ్ తో దూసుకుపోదామనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు చాలన్ల రూపంతో నోటీసులు అందుతున్న విషయం తెలిసిందే. నగర రోడ్లపై ఎక్కడిక్కడ నిఘానేత్రాలు మిమ్మల్ని వెంటాడుతూనే వుంటాయి. ఇక ప్రధాన కూడళ్ల వద్ద, రాంగ్ పార్కింగ్, వనే రోడ్లపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ లకు కూడా వాహనదారులు జరిమానాలు చెల్లిస్తూనే వున్నారు.  

ఈ క్రమంలో ఓ వాహనదారుడు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల కంట్లో పడ్డాడు. అతని బైక్ వెనక నో హెల్మెట్, ఐ డై లక్ ఎ రియల్ మెన్ అంటూ రాసివుంది. ఈ బైక్ ను గమనించిన పోలీసులు అతడి బైక్ ను ఫోటో తీసారు. బైక్ కృష్ణారెడ్డి అనే ఆ వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు.. సదరు బైక్పై వున్న చాలానాలను కూడా ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. అయితే ఇందులో ఏమంత ఆశ్చర్యముంది అంటారా.. అక్కడికే వస్తున్నాం. దీంతో పాటు పోటీసులు కూడా ఓ చిన్న వ్యాఖ్యం జత చేశారు.

అదేంటంటే..  వీ ఆర్ ఎక్స్ ట్రీమ్లీ సారీ మిస్టర్ కృష్ణారెడ్డి సార్.. వి వాంట్ లెట్ యు డై.. వీ విల్ సీ దట్ యు లివ్ లైక్ ల రియల్ మెన్.. ప్లీజ్ వేర్ హెల్మెట్ అండ్ రైడ్.. అని రాశారు. అంటే ‘కృష్ణా రెడ్డి గారు మీరు మమ్మల్ని క్షమించాలి. మేం మిమ్మల్ని చనిపోనివ్వం. నిజమైన మగాడిలా మీరు బ్రతికేలా మేం చేస్తాం’ అంటూ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చేసిన ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల ట్వీట్‌పై ‘నేనైతే ఇక ఎప్పుడూ హెల్మెట్‌ పెట్టుకోకుండా బయటకు వెళ్లను’ అంటూ ఓ నెటిజన్‌ రీట్వీట్‌ చేశారు. వాహనదారుల తప్పులను నొప్పించక సరిచేస్తున్న నగర ట్రాఫిక్‌ పోలీసులపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad traffic police  tweet  bike  photo  pending challans  viral news  social media  krishna reddy  

Other Articles