aadhar data leak from AP housing website ఏపీ స్టేట్ హౌసింగ్ వెబ్ సైట్ నుంచి ఆధార్ డాటా లీక్..!

Aadhar data leak from andhra pradesh housing website

Aadhar card, aadhar information, Supreme court, citizens personal information, aadhar data linking, government schemes, aadhar data leak, housing website, Andhra Pradesh

Even after Supreme court stays on aadhar data linking to government schemes, leak of aadhar data has been from Andhra Pradesh housing website.

ఏపీ స్టేట్ హౌసింగ్ వెబ్ సైట్ నుంచి ఆధార్ డాటా లీక్..!

Posted: 04/26/2018 12:12 PM IST
Aadhar data leak from andhra pradesh housing website

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధార్ ను ప్రభుత్వం స్కీములకు, బ్యాంకు, గ్యాస్, ప్యాన్, ఇన్సూరెన్సు, తదితర ఖాతాలకు అనుసంధానం చేయడం పట్ల స్టే విధిస్తూ.. తాము తుది తీర్పు వెలువరించే వరకు అనుసంధానం చేయవద్దని చెప్పినా.. అటు కేంద్రప్రభుత్వం మాత్రం ఆధార్ అనుసంధానంతో ఎన్నో ప్రయోజనాలు వున్నాయంటూ ప్రజలను మభ్యపెడుతూ టీవీలలో ప్రకటనలు గుప్పిస్తూ కోట్ల రూపాలయ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఇప్పటికే పలు ప్రభుత్వశాఖల నుంచి దేశ పౌరులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు లీక్ అవున్నాయని వార్తలు వస్తునేవున్నాయి.

దేశప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఆధార్ రూపంలో.. డిజిటల్ లాకింగ్ ద్వారా భద్రపర్చామని, దీంతో ఆ సమాచారం అత్యంత భద్రంగా తమ వద్ద ఉందని, ఇక తమ డాటా బేస్ ను బద్దలు కొట్టడం అసాథ్యమని యూఐడిఏఐ చెబుతున్నా.. తాజాగా సుమారు 1.30 లక్షల మంది వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్టు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల వెబ్ సైట్లలో నిక్షిప్తంగా వున్న ఈ డాటాను భద్రత గోడల మధ్య నుంచి సునాయాసంగా లీకైనట్లు తెలుస్తుంది. ఇప్పుడీ వార్త చర్చనీయాంశంగా మారింది.

యూఐడీఏఐ సర్వర్లలోకి జొరబడాల్సిన అవసరం లేకుండా, వివిధ ప్రభుత్వ విభాగాలు ఆధార్ సంఖ్యతో సమాచారాన్ని సేకరిస్తూ, ప్రజల బ్యాంకు ఖాతా వివరాలు, వారి కులమతాలు, ఆదాయ వనరులు తదితర విషయాలను హ్యాకర్లు సమీకరిస్తుండటంతో డాటా లీక్ అవుతుంది. ప్రభుత్వ సంస్థల్లో కొన్ని ప్రజల ఆధార్ వివరాలను అందరికీ కనిపించేలా వెబ్ సైట్లలోనూ పెడుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా వచ్చి చేరింది. మొత్తం 1.3 లక్షల మంది ఖాతాలను, వారి పూర్తి సమాచారాన్ని బయటకు వెల్లడించింది.

ఆధార్ ఖాతాలను కులం లేదా మతం వివరాల కోసం వినియోగించేది లేదని యూఐడీఏఐ స్పష్టం చేస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో లబ్దిదారుల ఎంపిక ఆధార్ లోని కులమతాల ఆధారంగానే జరుగుతోందన్నది నిజమని పలువురు నిపుణులు అంటున్నారు. యూఐడీఏఐ సేకరించిన బయో మెట్రిక్ వివరాలను వాడే విషయంలో నియమ నిబంధనలు కఠినంగానే ఉన్నప్పటికీ, అమలు మాత్రం జరగడం లేదన్నది అత్యధికుల వాదన. ఇక పీపుల్స్ హబ్ గా ఏపీ ప్రభుత్వం 2017లో ప్రారంభించిన ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్ సైట్ ఈ ఆరోపణల తరువాత మూతబడింది. ఈ వెబ్ సైట్ లో 29 విభిన్న విభాగాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోఢీకరించేందుకు ఆధార్ సంఖ్యను వినియోగించారు.

ఇది విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాలూ ఇదే తరహా విధానాన్ని పాటించాలని భావిస్తుండటంతో దేశంలో డేటా ప్రైవసీ మరింతగా దెబ్బతింటుందని, మరిన్ని ఖాతాల వివరాలు బహిర్గతమవుతాయని, ఇది అనిశ్చితికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆధార్ వివరాల లీక్ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరగా, తాము ఆధార్ చట్టం 2016లోని అన్ని నియమ నిబంధనలనూ పాటిస్తున్నామని, డేటా ప్రైవసీపై కోర్టుల ఆదేశాలు పాటిస్తున్నామని తెలిపింది. ఈ వార్తలను పరిగణనలోకి తీసుకున్నామని, విచారిస్తున్నామని, పూర్తి పరిస్థితిని సమీక్షించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles