governor slams media on creating him like a villan ‘‘ఇష్టమొచ్చినట్లు వార్తలు రాసి విలన్ గా చిత్రీకరించకండీ’’

Governor narasimhan slams media on creating him like a villan

governor slams media, governor fires on media, e.s.l. narasimhan, delhi tour, ap chief minister, chandrababu naidu, telugu desam, national panchayat raj day, Prime Minister, home minister, Narendra modi, Rajnath singh, TDP yellow media, Andhra pradesh, special status, andhra pradesh, politics

Governor Narasimhan, who returned to hyderabad after his two-day tour to delhi is cancelled in the half way, slams media not to write articles in their manner and stop creationg him like a villan,

మళ్లీ వార్తల్లోకి పచ్చమీడియా.. ఈ సారి గవర్నర్ వంతు..

Posted: 04/26/2018 11:43 AM IST
Governor narasimhan slams media on creating him like a villan

ఓ వైపు పచ్చ మీడియాపై ఇప్పటికే పలువురు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న క్రమంలో.. ఆ జాబితాలో ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా చేరారు. చంద్రబాబుతో భేటీ అయిన నేపథ్యంలో సాక్ష్యాత్తు గవర్నర్ పై ఇష్టానుసారం వార్తలు రాయడంతో ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తన ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఉమ్మడి ఏపీ, ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ ను కొనసాగించరంటూ వార్తలు రాసిన మీడియాపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

గవర్నర్ ఇప్పటికే 11 సంవత్సరాలపాటు కేవలం తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా సేవలందించారని దీంతో ఆయన పదవిని ఇక పొడగించరని.. అందుచేతే అతన్ని అర్థాంతరంగా వెనక్కు పంపారని మీడియాలో కథనాలు వచ్చాయి. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నరసింహన్ వెంటనే హైదరాబాద్ కు అర్థాంతరంగా తిరిగిరావడానికి ఇదే కారణమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో నరసింహన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆయన సెటైర్లు వేశారు.

తనపై ఇష్టం వచ్చినట్టు రాస్తూ, విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మీడియాను ఉద్దేశించి నరసింహన్ అన్నారు. 35 పేజీల నివేదికను కేంద్రానికి ఇచ్చినట్టు గతంలో రాశారని నిష్టూరమాడారు. ఇప్పటికే ఎంతోకాలం గవర్నర్ గా పని చేశానని... ఎవరైనా ఎంతకాలం పదవిలో ఉంటారు? అని ప్రశ్నించారు. తాను వెళ్లిపోయిన తర్వాత... తనంత మంచి గవర్నర్ లేడనే విషయాన్ని కూడా మీరే రాస్తారని చెప్పారు. తాను దేవాలయాలకు వెళ్లినా తప్పే అన్నట్టు వార్తలు రాస్తారని... పదవిలోకి రాకముందు కూడా దేవాలయాలకు వెళ్లడం తన అలవాటని... పదవి ముగిసిన తర్వాత కూడా తాను దేవాలయాలకు వెళతానని తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  esl narsimhan  Media  PM modi  Chandrababu  AP government  delhi tour  politics  

Other Articles