governor narasimhan back without meeting Modi, rajnath అర్థాంతరంగా ముగిసిన గవర్నర్ హస్తిన పర్యటన

Governor narasimhan back without meeting modi rajnath

governor, e.s.l. narasimhan, delhi tour, ap chief minister, chandrababu naidu, telugu desam, national panchayat raj day, Prime Minister, home minister, Narendra modi, Rajnath singh, TDP yellow media, Andhra pradesh, special status, andhra pradesh, politics

Governor Narasimhan, who left for Delhi on a two-day visit on Tuesday, is expected to meet PM Modi and Union home minister Rajnath Singh was cancelled and he is returning from delhi to hyderabad.

అర్థాంతరంగా ముగిసిన గవర్నర్ హస్తిన పర్యటన

Posted: 04/25/2018 09:06 AM IST
Governor narasimhan back without meeting modi rajnath

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ న్యూఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నాలుగు రోజుల క్రితం భేటీ అయిన సంరద్భంలో అక్కడ చర్చించిన అంశాలను ఢిల్లీలోని పెద్దలకు నివేదించే క్రమంలో హస్తిన నుంచి వచ్చిన అకస్మిక పిలుపు మేరకు ఢిల్లీకి నిన్న మధ్యాహ్నం పయనమైన గవర్నర్.. తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని తిరుగు పయనమయ్యారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీవ్ జైన్ తో కలసి చంద్రబాబుతో పలు అంశాలపై చర్చించిన క్రమంలో వాటి వివరాలను నివేదిక రూపంలో కేంద్రానికి సమర్పించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ బయలుదేరారు గవర్నర్.

ఇలా ఆయన పర్యటన మధ్యలోనే ముగియడం, ప్రధానితో భేటీ కాకపోవడం, నేడు షెడ్యూల్ లో ఉన్న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో చర్చలు సాగకపోవడం కొత్త చర్చను తెరపైకి తెచ్చింది. కాగా, ఇటీవలి కాలంలో గవర్నర్ తటస్థంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తుండటం, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్టుగా గవర్నర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన నేపథ్యంలో నరసింహన్ తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor  e.s.l. narasimhan  PM Modi  home minister  Rajnath singh  delhi tour  andhra pradesh  politics  

Other Articles