“Dead” man returns to life in Aligarh చితిపై నుంచి లేచివచ్చి.. యమపురి నుంచి తోసేసారని..

Uttar pradesh dead man wakes up from funeral pyre in aligarh

uttar pradesh, aligarh, dead man alive in aligarh, aligarh dead man alive, man alive after death, Dead man, Kirthala village, Atrauli police station, Ram kishore singh, aligarh news,

Stories of dead people returning to life are usually heard of in stories, but sometimes miracles do happen, as in the case of Ramkishore, a resident of Aligarh in Uttar Pradesh, who was pronounced dead but returned to life five hours

చితిపై నుంచి లేచివచ్చి.. యమపురి నుంచి తోసేసారని..

Posted: 04/24/2018 11:35 AM IST
Uttar pradesh dead man wakes up from funeral pyre in aligarh

సినిమా కథల్లో తప్ప మనకు ఎక్కడా వినిపించని, కనిపించని ఘటనలు అప్పడప్పుడు మనం వింటూనే వుంటాం. సరిగ్గా అదే సినీమా తరహలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలలో యమగోల, యముడికి మొగుడు, యమదొంగ లాంటి చిత్రాల్లో మనిషి జీవిత కాలం తీరకముందే పొరబాటున యమపురికి తీసుకెళ్లి.. ఆ తరువాత తిరిగి వెనక్కు పంపించే ఘటనలు మనం సినిమాల్లోనే చూశాం. కానీ ఇక్కడ ఈ మనిషి మాత్రం ఆ అనుభవాన్ని పొందాడు. తనకేమైందో తెలియదు.. ఏమీ గుర్తులేదు.. కానీ అచ్చింగా అలానే జరిగిందని గుర్తుచేసుకున్నాడు. అతడు మరణించాడని సరిగ్గా అతని చితికి తలకొరివి పెట్టేసమయానికి లేచి కూర్చుని బంధువులను, గ్రామస్థులను, కుటుంబసభ్యులను అశ్చర్యానికి గురిచేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌ జిల్లా కిర్తలా గ్రామానికి చెందిన రామ్‌ కిషోర్‌ సింగ్‌, అలియాస్ భూరాసింగ్ (53).. అచేతనంగా ఏ కదలిక లేకుండా పడివుండటంతో అతనికి ఏమైందోనన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని పరీక్షించిన వైద్యులు మరణించాడని నిర్దారించారు. అకస్మాత్తుగా ఎలా మరణించిన భూరాసింగ్ బౌతికకాయానికి బంధువులు కబురుపెట్టిగానే వారు చేరుకున్నారు. ఇక బంధువులు, గ్రామస్థులు దహనసంస్కారాలు ఏర్పాటు చేశారు. అంత్యక్రియలకు అంతా రెడీ చేశారు.

కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామంలోని భూరాసింగ్ స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. అంతా కలిసి పాడెపై శ్మశానానికి తీసుకెళ్లారు. చితి పేర్చారు. మంటపెట్టడమే ఆలస్యం. ఇంతలో అకస్మాత్తుగా భూరాసింగ్ లేచి కూర్చున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన బంధువులు.. ఏం జరిగిందని ఆయనను అడుగగా.. తనకు పెద్దగా జ్ఞాపకం లేదు కానీ, తానో చోటుకి వెళ్లానని, అక్కడ మరి కొంత మంది కూర్చుని ఉన్నారని చెప్పాడు. అక్కడ పెద్ద గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి ఇతన్ని అప్పుడే ఎందుకు తెచ్చారు? అంటూ ప్రశ్నించాడని, ఇతనిని తీసుకొచ్చేందుకు ఇంకా సమయం ఉందని తెలిపాడని చెబుతున్నాడు.

 ఆ తరువాత తనను ఎవరో తోసేసినట్టైందని, కళ్లు తెరిచి చూసేసరికి బంధువులంతా కనిపించారని అంటున్నాడు. దీంతో ఆయనను ఇప్పుడు మిరకిల్ మ్యాన్ గా గ్రామస్థులు పిలిచుకుంటున్నారు. దీనిపై వైద్యనిపుణులు మాట్లాడుతూ, అతడు చనిపోవడం నిజం కాదని అన్నారు. ఒక్కోసారి గుండె బాగా నెమ్మదిగా కొట్టుకోవడం వల్ల కోమాలోకి వెళ్తారని, దీంతో వారు చనిపోయినట్టుగా వైద్యులు పొరపాటు పడతారని, వాస్తవానికి వారు బతికే ఉంటారని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయని వారు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttar pradesh  aligarh  dead man  alive  Kirthala village  Atrauli police station  Ram kishore singh  

Other Articles