pawan kalyan says he will take telanagan police support తెలంగాణ పోలీసుల సహకారం తీసుకుంటా: జనసేనాని పవన్

Pawan kalyan says he will take telanagan police support

pawan kalyan, janasena, guntur, mangalagiri, telangana police, sri reddy, amaravati, cating couch episode, sunkara srinivasa rao, ravi prakash, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan says he will take telanagan police support in investigation of the entire episode of sri reddy and unnessarly pulling him into this issue and doing wrong propoganda against him.

తెలంగాణ పోలీసుల సహకారం తీసుకుంటా: జనసేనాని పవన్

Posted: 04/24/2018 10:33 AM IST
Pawan kalyan says he will take telanagan police support

సోషల్ మీడియా ఖాతాల్లో వరుసగా పోస్టులు పెడుతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తానెప్పుడూ నిస్వరుడిని, నిస్సహాయుడినేనంటూ, మార్టిన్ నైమోలర్ కోట్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తాను అనునిత్యం తమ గళం వినిపించలేని, నిస్సహాయలతోనే వుంటానంటూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పోస్టు లోని సారాంశం.. "తొలుత కమ్యూనిస్టుల కోసం వారు వచ్చారు. కమ్యూనిస్టును కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. తరువాత సోషలిస్టుల కోసం వారు వచ్చారు. సోషలిస్టును కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. తదుపరి వర్తక సంఘాల కోసం వారు వచ్చారు. వర్తక సంఘాల వ్యక్తిని కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. ఆపై యూదుల కోసం వారు వచ్చారు. యూదుడిని కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. ఆ తరువాత నా కోసం మాట్లాడాల్సి వచ్చేవరకు ఒక్కరు కూడా మిగల్లేదు" అన్న వ్యాఖ్యలున్న పోస్టర్ ను పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

గత  రాత్రి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫొటో పోస్టు చేసి భోజనంలో కాస్తంత సంస్కారాన్ని కూడా వడ్డించమని కుమారుడికి సలహా ఇచ్చి గుడ్ నైట్ చెప్పిన పవన్.. ఉదయాన్నే వరుస ట్వీట్లతో టీవీ 9 సీఈఓ రవిప్రకాష్ ను టార్గెట్ చేశారు. రవిప్రకాశ్ దంపతులు పూజలో ఉన్న ఫొటోను పోస్టు చేశారు. ‘నువ్వు దేవుడిని, పూజలను కూడా నమ్ముతావా’ అని క్యాప్షన్ తగిలించారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ ‘‘నీకు కొన్ని ఆర్టికల్స్ పంపిస్తున్నాను. వీటితో కూడా ఏమైనా షో చేయగలవా?’’ అని ప్రశ్నించారు. అనంతరం మరో ట్వీట్లో రవి ప్రకాశ్ కు బహిరంగ లేఖ పేరుతో కొన్ని ఆర్టికల్ క్లిప్పింగులు విడుదల చేశారు. ఈ క్లిప్పింగుల ఆధారంగా రాత్రి 9 గంటల షో చేసి సమన్యాయం చేయాలని సూచించారు. తాము నోరు మూసుకుని ఉంటున్నందుకే తమపై విషం కక్కుతున్నారని ఆరోపించారు.

అలాగే టీవీ 9 అధినేత శ్రీనిరాజుపైనా పవన్ విరుచుకుపడ్డారు. ‘‘ఐఎస్‌బీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు బోర్డు మెంబరుగా ఉన్న నీవు.. నీ చానెల్‌లో మాత్రం అభ్యంతరకరమైన వార్తలు ప్రసారం చేస్తావా? కాస్త, గౌరవప్రదంగా నడుచుకోవడం నేర్చుకో’’ అని సూచించారు. ఇక ఆ తరువాత కొంతసేపటికి గత ఆరు మాసాలుగా తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై దర్యాప్తు జరపాల్సిందిగా తెలంగాణ పోలీసులను అభ్యర్థించనున్నట్లు పవన్ మరో ట్వీట్ లో పేర్కోన్నారు. ఈ దెబ్బతో తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారి పేర్లన్నీ బయటకు వస్తాయన్నారు.

తనపై కుట్రపూరితంగా, కుతంత్రాలు పన్నుతూ చేసిన దుష్ప్రచారం వెనుకనున్న పురుషులు, మహిళ జాతకాలు అన్నీ బయటకు వస్తాయని, అది క్రమంగా అమరావతి వైపు దారి తీస్తుందంటూ సంచలన ట్వీట్ చేశారు. దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు, రాజకీయ నాయకులు, మీడియా పెద్దలు, వారి పిల్లలు.. అందరూ బయటకు వస్తారని పేర్కొన్నారు. సమాజంలోని కుళ్లు కూడా బయట పడుతుందన్నారు. ‘‘మీరందరూ కలిసి నడి రోడ్డుపై ఓ సోదరి బట్టలు ఇప్పించేలా ప్రోత్సహిస్తే దానిని మీడియా చూపించింది. అన్ని ‘షో’లకు అది కారణమైంది’’ అని పవన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, పవన్ కల్యాణ్ కు టీడీపీ నుంచి ప్రాణహాని ఉందని అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న మీడియా అనుచరుల ద్వారా పవన్ కు ఏదైనా జరిగితే అందుకు టీడీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వ నాలుగేళ్ల వైఫల్యాలను పవన్ విమర్శించడం వల్లే చంద్రబాబు, లోకేశ్ కక్షగట్టారని ఆరోపించారు. పవన్ విమర్శలను జీర్ణించుకోలేకే వెకిలి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలకు లోకేశ్ కోట్లాది రూపాయలు ఇచ్చి పవన్ ను తిట్టిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles