Man accused of raping minor girl in police net మరో దారుణం.. 14ఏళ్ల బాలికపై అత్యాచారం..

Powerful businessman rapes threatens 14 yr old girl in tripura

tripura girl raped, crime, crime against women, Rape, GangRape, Business man rape, champlai rape, tripura Khowai district, rape, crime

In yet another incident of crime against women, a 58-year-old-man has been arrested for allegedly raping a 14-year-old girl for about three months in Tripura's Khowai district.

మరో దారుణం.. 14ఏళ్ల బాలికపై వీహెచ్పీ నేత అత్యాచారం..

Posted: 04/23/2018 06:47 PM IST
Powerful businessman rapes threatens 14 yr old girl in tripura

నిర్భయ చట్టం వచ్చినా మగమృగాళ్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాత వయన్సున్న ఓ వ్యాపారవేత్త.. ఏకంగా 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడి.. అమను బెదిరింపులకు గురిచేస్తూ గత మూడు నెలలుగా పదకొండు పర్యాయాలు బలవంతంగా లోబర్చుకుని మారీ అత్యాచారానికి పాల్పడ్డారు. వీహెచ్ పీ రాష్ట్రస్థాయి నేతగా సేవలందించిన ఈయన బీజేపి మద్దతుదారు కూడా. అత్యాచార వివరాలను ఎక్కడైనా, వెవరికైనా వెల్లడించిన పక్షంలో తీవ్ర పరిణామాలు వుంటాయని కూడా అతను బెదిరించాడు.

తాత వయస్సున్న వ్యక్తి తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడటం, బెదిరింపులతో తనను మళ్లీ మళ్లీ రావాలని పిలవడంతో బెదిరిపోయిన బాలిక.. తమ బంధువుల గ్రామానికి వెళ్లిన బాలిక.. బంధువుల సాయంతో 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారిపై పిర్యాదు చేయడంత కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... త్రిపురలోని ఖోవాయి జిల్లా తెలియమురాకు చెందిన మనోజ్ డెబ్ (54) పలు వ్యాపారాలు నిర్వహిస్తూ, బీజేపీ నేతగా ప్రచారం చేసుకుంటాడు. గత ఫిబ్రవరి 11న ఛంప్లాయ్‌ లోని తన ఫామ్‌ హౌస్‌ లో మైనర్ బాలిక (14) పై తొలిసారి అత్యచారానికి పాల్పడ్డాడు.

ఈవిషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడ్డ బాలిక నిస్సహాయతను ఆసరాగా తీసుకుని ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆమెపై అత్యాచార కాండ సాగించాడు. గతవారం మళ్లీ ఫామ్‌ హౌస్‌ కు రావాలని హుకుం జారీ చేయడంతో బాధితురాలు జరిగిన ఘోరాన్ని తన స్నేహితురాలికి వివరించింది. స్నేహితురాలి ప్రోత్సాహంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఖోవాయి ఎస్పీ మాట్లాడుతూ, మనోజ్ డెబ్ పెద్ద వ్యాపారవేత్త అని, కేసును ప్రభావితం చేయగలడని తెలిపారు. తాము అతనిపై పోక్సో చట్టంకింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించామని తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles