I feel unsafe in BJP-ruled Karnataka: Prakash Raj కాకిని జాతీయ పక్షిగా చేయాలని ప్రకాష్ రాజ్ సూచన

Why not make crow a national bird when called hindustan prakash raj

Prakash Raj, south indian actor, #just asking, hindus, hindustan, crow, national bird, rightwingers, unsafe in bjp government, kalaburagi, karnataka, assembly elections, bjp power, social activist, gauri lankesh, politics

Targeted by rightwingers, actor-activist Prakash Raj said if hindus in the country are at large number then call it hindustan, crow in country are also in large, why not make it national bird.

హిందుస్తాన్ లో కాకిని జాతీయ పక్షిగా ఎందుకు చేయరు.? ప్రకాష్ రాజ్

Posted: 04/23/2018 09:16 AM IST
Why not make crow a national bird when called hindustan prakash raj

తన సోదరి, ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ మరణంలో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన హత్యేనని అనుమానాలను రేకెత్తిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ తన నోరు విప్పాలి అంటూ ఘాటుగా స్పందించిన సినీనటుడు ప్రకాష్ రాజ్.. ఇక అది మొదలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తరచూ విరుచుకుపడుతున్నాడు. టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాలను మొదలుకుని బీజేపి నేతలు చేసిన అన్ని విమర్శలను ఆయన ధీటుగా, సమర్థవంతంగా తిప్పికొడుతూ వచ్చారు.

కర్ణాటక రాష్ట్రంలో బీజేపి పార్టీ అధికారంలోకి వస్తే.. ఇక కర్ణాటక రాష్ట్రంలో మనజాలడం తనకు శ్రేయస్కరం కాదని ఇదివరకే చెప్పిన ప్రకాశ్ రాజ్.. కాలబురాగి ప్రాంతానికి వెళ్లిన తనను బీజేపి కార్యకర్తలు అడ్డుకుని, ఘెరావ్ చేశారని అంతటితో అగని బీజేపి కార్యకర్తలు తన కారుపై రాళ్లతో దాడి చేశారని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపి అధికారంలోకి వస్తే ఇక కర్ణాటక రాష్ట్రంలో ఎలా ప్రశాంతంగా వుండగలమని ప్రశ్నించారు.

ఇక హిందువులు అధికంగా వున్నందున దేశాన్ని హిందుస్తాన్ అని పిలవాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వినూత్నంగా స్పందించారు. హిందువులు ఎక్కువగా ఉన్నారని భారత్ ను హిందూస్తాన్ అని ఎలా పిలుస్తారన్న ఆయన, ఒకవేళ అందుకు సంఖ్యే ప్రామాణికం అనుకుంటే కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలని కోరారు.

జాతీయ పక్షి మయూరాల సంఖ్య కంటే కాకుల సంఖ్యే ఎక్కువ కాబట్టి నెమలికి బదులు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించాలని సూచించారు. బెంగళూరులో సామాజిక ఉద్యమకారిణి, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగిన వెంటనే సంబరాలు చేసుకున్న వారిని ప్రధాని మోదీ ఎందుకు వ్యతిరేకించలేదని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. ఈ విషయంలో ఆయన మౌనంగా ఉన్నందుకే వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Raj  south indian actor  #just asking  hindus  hindustan  crow  national bird  karnataka  politics  

Other Articles