Kathua case: Vaginal swabs match with accused కతువా కేసులో నిందితులు వీళ్లేనని తేల్చిన నివేదికలు

Kathua gangrape murder case vaginal swabs match with accused confirms forensic lab

Kashmir, Mehbooba Mufti, Peoples Democratic Party, National Conference, Militant, Syed Ali Geelani, Mirwaiz Umar Farooq, Yasin Malik, Hurriyat, JKLF

The Delhi Forensic Science Laboratory (DFSL) has confirmed that the vaginal swabs of the Kathua gangrape-and-murder victim matched with that of the accused, an evidence seen as a jackpot for the investigating team of the Jammu and Kashmir Police.

కతువా కేసులో నిందితులు వీళ్లేనని తేల్చిన నివేదికలు

Posted: 04/21/2018 01:06 PM IST
Kathua gangrape murder case vaginal swabs match with accused confirms forensic lab

నిర్భయ ఘటన తరువాత దేశవ్యాప్తంగా కలకలం రేపిన అత్యాచారాలు బీజేపి ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్న ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్, జమ్మూలోని కథువా అత్యాచారాలని చెప్పనక్కర్లేని విషయం. కాగా ఉన్నావ్ లో బీజేపి ఎమ్మెల్యే సహా అయన సోదరుడు ఊచలు లెక్కపెడుతూన్న క్రమంలోనే కతువా హత్యాచార ఘటనలో నిందితులను గుర్తించేందుకు నిర్వహించిన డీఎన్ఏ టెస్టు వివరాలు వెల్లడయ్యాయి.

ఈ కేసులో నిందితులను తేల్చేందుకు ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ 14 పరీక్షలను నిర్వహించాలని అదేశించడంతో వెజైనల్ స్వాబ్స్, హెయిర్ స్ట్రాండ్స్, నలుగురు నిందితుల బ్లడ్ శ్యాంపిళ్లతో పాటు మృతురాలి విస్రా, బాలిక ఫ్రాక్, సల్వార్, అక్కడున్న మట్టి, రక్తపు మరకలను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షలు నిర్వహించారు.

శ్యాంపిళ్లను పరీక్షించిన తరువాత నిందితులే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ల్యాబ్ తేల్చింది. యోని ద్రవాలపై నిర్వహించిన పరీక్షలో డీఎన్ఏ శాంపిళ్లు కూడా మ్యాచ్ అయినట్టు రిపోర్ట్ వెల్లడించింది. దీంతో నార్కో టెస్టుకు సిద్ధమంటూ నిందితులు చేసిన వ్యాఖ్యలు కేసును పక్కదారి పట్టించేందుకేనని నిర్ధారణ అయింది. ఈ నివేదికను జమ్మూకశ్మీర్ క్రైం పోలీసులకు అందజేసినట్లు ల్యాబ్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles