Raj Tarun’s father sentenced three years Jail యువ హీరో రాజ్ తరణ్ తండ్రికి మూడేళ్ల జైలు

Raj tarun s father sentenced three years jail

tollywood young hero, Raj Tarun, Raj tarun father Nidamarthi Basavaraju, raj tarun father jailed, jail sentence for raj tarun father, debt on fake gold, special assistant cashier, Simhachalam, vishakapatnam, tollywood

Young actor Raj Tarun’s father Nidamarthi Basavaraju has been sentenced three years jail term for taking debt on fake gold, while serving as a special assistant cashier in Simhachalam region

యువ హీరో రాజ్ తరణ్ తండ్రికి మూడేళ్ల జైలు

Posted: 04/21/2018 12:34 PM IST
Raj tarun s father sentenced three years jail

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. విశాఖపట్నంలోని వేపగుంట ప్రాంతానికి చెందిన బసవరాజు (53) సింహాచలం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్‌ క్యాషియర్ గా విధులు నిర్వహించారు. అయితే తాను అక్కడ విధులు నిర్వహిస్తున్న క్రమంలో 2013లో నకిలీ బంగారాన్ని కుదవపెట్టి రుణం తీసుకున్నారు.

ఈ కేసులో న్యాయస్థానాన్ని ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ కేసులో హీరో రాజ్ తరణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అప్పట్లోనే తన భార్య రాజ్యలక్ష్మితో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఎం.ఎస్‌.ఎన్‌.రాజు, ఎన్‌.సన్యాసిరాజు, కె.సాంబమూర్తి, ఎన్‌.వెంకట్రావు పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9.85 లక్షల రుణాన్ని తీసుకున్నారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు బ్యాంకు అధికారులు ఆడిట్ తనిఖీలు చేశారు. నకిలీ బంగారు వస్తువులు బయటపడడంతో బ్యాంకు మేనేజర్ గరికిపాటి సుబ్రహ్మణ్యం గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ ఈదుల నరసింహారావు కేసు నమోదు చేసి కోర్టుకు నివేదిక అందజేశారు. విచారణ అనంతరం  విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సన్నీపర్విన్ సుల్తానాబేగం తీర్పును వెల్లడించారు. నిందితుడు బసవరాజుకు మూడేళ్ల  జైలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  young hero  Raj Tarun  Raj tarun father Nidamarthi Basavaraju  movies  entertainment  

Other Articles