Diesel hits all-time high; petrol prices at 55-month high జేబులు గుల్లా.. అల్ టైం హైకి డీజిల్.. రూ.80కి పెట్రోల్..

Diesel hits another all time high petrol prices at 55 month high

petrol prices, diesel prices, taxes, VAT, UPA government, P. Chidambaram, diesel hits all-time high

The price of sensitive petroleum products have risen record high since deregulation. Petrol prices have touched 81.93 a litre in Mumbai,a 55-month high while diesel prices have touched 69.54, an all time high

జేబులు గుల్లా.. అల్ టైం హైకి డీజిల్.. రూ.80కి పెట్రోల్..

Posted: 04/20/2018 08:08 PM IST
Diesel hits another all time high petrol prices at 55 month high

డీజిల్‌, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. శుక్రవారం డీజిల్ ధర ఆల్ టైం గరిష్ఠానికి చేరింది. ఢిల్లీలో ఈరోజు లీటర్ డీజిల్ ధర రూ.65.31గా ఉంది. కోల్‌కతాలో రూ.68.01గా, ముంబయిలో రూ.69.54గా, చెన్నైలో రూ.68.9గా ఉంది. పెట్రోల్ ధర కూడా 55 నెలల గరిష్ఠానికి చేరింది. ఇండియన్ ఆయిల్ వెబ్ సైట్ ప్రకారం డిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.08గా ఉంది. 2013 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక ధర.

ఈ ఏడాది మార్చి నుంచి  ప్రముఖ నగరాల్లో పెట్రోల్ ధర 50పైసలకు పైగా, డీజిల్ ధర 90పైసలకు పైగా పెరిగింది. ఏడాది ప్రారంభంలోనూ ప్రముఖ నగరాల్లో పెట్రోల్ ధర రూ.4కు పైగా, డీజిల్ ధర రూ.5-6 మధ్యలో పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ గత ఏడాది జూన్ లో పదిహేను రోజులకోసారి ధరలు మార్చే విధానాన్ని తీసేసి ప్రతి రోజూ ధరలు మారే విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో ధరల మార్పు ప్రభావం వెంటనే చూపిస్తోంది.

ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.73.73తో నాలుగేళ్ల గరిష్ఠానికి చేరగా, డీజిల్‌ ధర రూ.64.58పైసలతో ఆల్ టైం గరిష్ఠానికి చేరింది. ధరలు బాగా పెరుగుతుండడంతో ప్రభుత్వం ఎక్సైజ్ పన్నులు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాసియా దేశాల్లో భారత్ లోనే పెట్రోల్‌, డీజిల్ రిటైల్‌ ధరలు అధికంగా ఉన్నాయి. కాగా ఈ విషయమై కేంద్రమాజీ అర్థిక శాఖా మంత్రి చిదంబరం కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు 74 యూఎస్ డాల్లర్లు వుందని, అయితే ఇది 2014 మే నెలతో పోల్చితే దాదాపపుగా 31 డాలర్లు తక్కువగా వుందని.. కానీ అప్పటి పెట్రోల్ ధర కన్నా ఇప్పటి పెట్రోల్ ధర ఎందుకు పెరిగిందని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol prices  diesel prices  taxes  VAT  UPA government  P. Chidambaram  diesel hits all-time high  

Other Articles