Media houses apologise before Delhi HC తప్పు చేశారు.. పది లక్షలు కట్టండి: మీడియాకు హైకోర్టు షాక్

Media houses apologise before delhi hc for revealing victim s identity

Delhi High Court, India, Jammu and Kashmir, Journalism, kathua, kathua case, kathua news, kathua temple, kathua chargesheet, kathua delhi high court, delhi high court kathua case, delhi high court decree, delhi high court announcement, delhi high court on kathua rape case, kathua rape and murder case, crime

Media houses, issued notices for revealing the identity of the eight-year-old Kathua rape victim, on Wednesday apologised before the Delhi High Court and were directed to pay Rs 10 lakh each to the Jammu and Kashmir Victim Compensation Fund.

తప్పు చేశారు.. పది లక్షలు కట్టండి: మీడియాకు హైకోర్టు షాక్

Posted: 04/18/2018 05:44 PM IST
Media houses apologise before delhi hc for revealing victim s identity

జమ్ముకశ్మీర్ లోని కథువాలో సభ్యసమాజం తలదించుకునే విధంగా ఎనమిదేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా పైశాచిక మృగాలు అలయంలోనే సామూహికంగా అఘాయిత్యానికి తెగబడిన కేసులో మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టులో జలక్ తగిలింది. ఈ కేసులో అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన మీడియా సంస్థలకు న్యాయస్థానం ఏకంగా షాక్ తగిలేలా నిర్ణయాన్ని వెల్లడించింది. అదేంటి అన్యాయమైన బాలిక విషయం తెలియగానే దానిని యావత్ దేశానికి తెలియజేశాం. ఇందులో తప్పేముంది అంటారా..? వార్తను అందించడంలో తప్పులేదు కానీ.. సామూహిక అత్యాచార కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి.. బాధితురాలి పేరును కూడా వెల్లడించారు.

దీంతో మీడియా సంస్థలు బాధితురాలి పేరును వెల్లడించడం వల్ల బాలిక వివరాలు బయటకు వచ్చాయని, దీంతో భవిష్యత్ లో బాధితురాలి కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయంటూ ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక వివరాలను బయటపెట్టిన మీడియా సంస్థలకు 10 లక్షల రూపాయల ఫైన్ విధించింది. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం శుక్రవారం దేశంలోని పలు డేలీ పేపర్స్,  టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసింది. నిర్భయకేసులో సంయమనం పాటించిన మీడియా ఈ కేసులో ఎందుకు అలా చేయలేక పోయిందని ప్రశ్నించింది. సున్నితమైన అంశాల్లో మీడియా సంస్థలు నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. మీడియా సంస్థలకు విధించిన జరిమానా డబ్బును బాధితురాలి కుటుంబానికి కోర్టు అందేజేస్తుందని తెలిపింది. ఎవరైనా అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బహిర్గతం చేస్తే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi High Court  India  Jammu and Kashmir  Journalism  Kathua rape and murder case  Media  crime  

Other Articles