No cash boards at ATMs, banks playing havoc ఇంకెన్నాళ్లు ఈ కరెన్సీ నోట్ల కష్టాలు..

Cash crunch in many parts of india as atms run dry government says solution in 3 days

cash shortage, cash crunch, India cash shortage, ATM dry, Cash crisis, No Money, ATMs-banks, cash boards, banks and ATMs, ATMs-banks playing havoc, no cash boards

Severe cash crisis has thrown life out of gear as ATMs have run dry in several states and cities including Telangana, Hyderabad, Varanasi, Vadodara, Bhopal, Patna and a few areas in Delhi.

కరెన్సీ నోట్లకు రెక్కలోచ్చాయా..? నో క్యాష్ బోర్డు పరమార్థమేమిటో.?

Posted: 04/17/2018 12:17 PM IST
Cash crunch in many parts of india as atms run dry government says solution in 3 days

దేశాన్ని మొత్తం డిజిటిలైజేషన్ గా మారుస్తామని చెప్పిన కేంద్రం.. ఆ దిశగా నత్తనడకన సాగుతూ.. దేశ ప్రజలను మాత్రం కరెన్సీ కష్టాలను అలవాటు చేస్తోంది. ఎక్కడ ఎన్నికలు వుంటే అక్కడ కరెన్సీ కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్న కేంద్ర.. ఎన్నికలు దరిదాపుల్లో లేని రాష్ట్రాల్లో మాత్రం ప్రజలకు చుక్కలు చూపుతుంది. దీంతో ఇప్పుడు యావత్ దేశం క్యాష్.. క్యాష్ అంటూ గగ్గోలు పెడుతోంది. అసలు కరెన్సీ కట్టలకు ఏమైంది.. రెక్కలు వచ్చాయా..? ఎగిరిపోయాయా.? అంటూ దేశప్రజలు ఊసూరుమంటున్నారు.

2016 నవంబర్ పదోవ తేది తరువాత ఉత్పన్నమైన పరిస్థితులే ఉత్పన్నం అవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. బ్యాంకుల్లో నో క్యాష్.. ఏటీఎంకి వెళితే నో క్యాష్ బోర్డులు.. లేదా.. తాళాలు వెక్కిరించడం కనిపిస్తుండటంతో.. డబ్బు కోసం వెళ్తున్న కస్టమర్లకు చిరెత్తుకోస్తుంది. సర్లే ఒక్క ఏటీయమే కదా... అంటూ మరో ఏటీయం కేంద్రానికి వెళ్లినా అదే పరిస్థితి.. అవసరానికి డబ్బు అత్యవసరంగా కావాల్సి వచ్చినా.. డబ్బులు లేకపోవడంతో.. పరిస్థితులు అత్యంత దారుణంగా కనిపిస్తున్నాయని ఖాతాదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 80శాతం ఏటీయం కేంద్రాలల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పని చేసే ఏటీఎంల్లోనూ వందల మంది క్యూ కట్టి మళ్లీ నోట్ల రద్దు నాటి పరిస్థితులను ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలోని రాజ్ భవన్ ప్రాంతంలో.. ముఖ్యమంత్రి సహా పలువురు నివాసాలుంటే ప్రాంతంలోని ఏటీఎంల్లోనూ డబ్బు లేదు అనే బోర్డులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా స్పందించి.. 2వేల నోట్లు కనిపించటం లేదని అధికారులను వాకాబు చేశారు.

యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో 85శాతం ఏటీఎంలు 48 గంటలుగా పని చేయటం లేదు. ఎక్కడికి వెళ్లినా డబ్బు లేదు అనే మాట వినిపిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బును మాకిచ్చేందుకు బ్యాంకులకు ఏంటీ బాధ అంటూ అక్రోశం వెల్లగక్కుతున్నారు. దీనిపై RBI స్పందించింది. వరసగా వచ్చిన పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లతో నగదు కొరత ఏర్పడిందని.. మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించారు. అయితే మూడు రోజుల తరువాత మళ్లీ శనివారం.. అదివారం దీంతో మళ్లీ సోమవారం నాటికి పరిస్థితులు సాధారణంగా మారుతాయని బావిస్తున్నారు ప్రజలు. అయితే అర్బీఐ చెప్పినా.. బ్యాంకు ఏటీయం కేంద్రాల్లోకి డబ్బు వస్తుందా..? రాదా.?? అన్న సందేహాలు మాత్రం ఇంకా ఖాతాదారుల్లో నెలకొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash shortage  cash crunch  India cash shortage  ATM dry  Cash crisis  No cash boards  

Other Articles