Bomb blast outside Indian consulate office in Nepal నేపాల్ లో భారత దౌత్యకార్యాలయం ఎదుట బాంబు పేలుడు..

Minor explosion near indian embassy camp office in nepal

Biratnagar, Indian Embassy, ISI, Kathmandu, Nepal, Pakistan, bomb blast, kathmandu, Minor explosion, bomb, blast, bihar, crime

The Indian embassy in Nepal's Biratnagar was attacked late on Monday night, damaging a wall, media reports said. Two youths on a motorcycle reportedly planted the bomb.

నేపాల్ లో భారత దౌత్యకార్యాలయం ఎదుట బాంబు పేలుడు..

Posted: 04/17/2018 12:11 PM IST
Minor explosion near indian embassy camp office in nepal

నేపాల్ లోని భారత దౌత్య కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. బిరాట్‌నగర్ లోని భారత కన్సూలేట్ కార్యాలయం వద్ద బాంబు విస్పోటనం సంభవించడంతో స్థానికంగా కలకలం రేగింది. గతరాత్రి సంభవించిన ఈ విస్పోటనం అత్యల్పమోతాదుతో సంభవించిందని, దీని ధాటికి కార్యాలయం పశ్చమ బాగన వున్న ప్రహరీ గోడ స్వల్పంగా ధ్వంసమైనట్లు అక్కడి పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో కార్యాలయం వెనుకనున్న ఖాళీ స్థలంలో బాంబును అమర్చినట్లు స్థానిక ఎస్సీ అరుణ్ కుమార్ బిసి వెల్లడించింది.  రాత్రి సమయంలో ఇద్దరు అగంతకులు బైక్ పై వచ్చి ఈ బాంబును అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ ముష్కరమూకల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ బాంబుదాడి నేపథ్యంలో పలు దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలను కూడా ఐఎస్ఐ ఉగ్రవాదులు టార్గెట్ చేసి వుంటారన్న అనుమానాలను కూడా నేపాల్ పోలీసులు వ్యక్తం చేశారు. కాగా, ఆయా కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికారులను కూడా నేపాల్ పోలీసులు సూచించినట్లు సమాచారం. అయితే నేపాల్ పోలీసుల సూచనల మేరకు వివిధ దేశాల దౌత్యవేత్తలకు అప్రమత్తంగా వుండాలని, కార్యాలయాల వద్ద సెక్యూరిటీని పెంచుకునే ఏర్పాటు చేసుకోవాలని భారత విదేశాంగ శాఖ సమాచారం అందించినట్లు తెలుస్తుంది.

కాగా, నేపాల్ లోని భారత దౌత్యకార్యాలయం వున్న స్థానిక బిరాట్ నగర్ లో సోమవారం రోజున నేపాల్ లోని ఓ రాజకీయ పార్టీ కూడా బంద్ కు పిలుపునిచ్చిందని.. అయితే వారేమైనా ఈ అసాంఘిక కార్యానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో స్థానిక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బిరాట్ నగర్‌.. బీహార్‌ సరిహద్దుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, నేపాల్‌ ఎంబసీ వద్ద చిన్న పేలుడు జరిగిందని, ఆ సమయంలో కార్యాలయం ఎవరూ లేరని భారత అధికారులు తెలిపారు. నేపాల్ లో, ఉత్తర బీహార్ లో భారీ వరదలు వచ్చినప్పుడు తాత్కాలికంగా ఎంబసీ కార్యాలయం ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి అది కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Biratnagar  Indian Embassy  ISI  Kathmandu  Nepal  Pakistan  bomb blast  kathmandu  Minor explosion  bomb  blast  bihar  crime  

Other Articles