Kambhampati Haribabu resigns as party president హరిబాబు రాజీనామా.. తప్పించారా..? తప్పుకున్నారా..?

Haribabu resigned to the pesident post voluntarily or forced

kambhampati haribabu, haribabu, bjp, andhra pradesh, tdp, vishnu kumar raju, vishnu vardhan reddy, BJP State president, Venkaiah naidu, General elections, Politics

Kambhampati Haribabu resigned to the post of Andhra Pradesh BJP president, he says he wants the party to give this oppurtunity to the young people in view of general elections

హరిబాబు రాజీనామా.. తప్పించారా..? తప్పుకున్నారా..?

Posted: 04/17/2018 11:05 AM IST
Haribabu resigned to the pesident post voluntarily or forced

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మార్పులు జరుగుతాయన్న అంచనాలు వచ్చిన నేపథ్యంలో అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. రాష్ట్ర బీజేపి అధ్యక్షుడిగా కొనసాగుతూ రాష్ట్రంలో అధికార పార్టీ పట్ల మెతక వైఖరిని అవలంబిస్తున్న కంభంపాటి హరిబాబును బీజేపి రాష్ట్ర నాయకత్వం తనకు తానుగా రాజీనామా చేసేట్లు చేసింది. ఈ నేపథ్యంలో హరిబాబు నిన్న రాత్రి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హరిబాబు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపినట్టు తెలిసింది.

అధ్యక్ష పదవి నుంచి హరిబాబును తప్పించి సమర్ధుడైన మరో నేత.. అధికార టీడీపీపై ధీటుగా విమర్శలు చేస్తున్న నేతను ఎంపిక చేయాలన్న కసరత్తు అంతర్గతంగా గత నెల రోజుల క్రితం నుంచే సాగుతుందని సమాచారం. అయితే ఇంత అకస్మాత్తుగా కంభంపాటి హరిబాబు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష పదవిని ఆయన తనకు తానుగా వదులుకున్నారా? లేక అధిష్ఠానం సూచన మేరకే రాజీనామా చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత టీడీపీ-బీజేపీ మధ్య వున్న అనుబంధం చెడింది. దీంతో బీజేపీలోని ఓ వర్గం నేతలు టీడీపీపై రోజూ విమర్శలు, అరోపణలతో విరుచుకుపడుతున్నారు. అయితే, హరిబాబు మాత్రం ఈ విషయంలో పూర్తిగా సంయమనం పాటిస్తున్నారు. దీంతో అధ్యక్షుడే సంయమనం పాటిస్తూ వుంటే.. పార్టీ ఉనికి కాపాడటం చాలా కష్టమని కొందరు నేతలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దీనిపై క్షుణ్ణంగా అలోచించిన పార్టీ.. హరిబాబును తనకుతానుగా తప్పుకోవాలని అదేశించినట్లు తెలుస్తుంది.

అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించిన రాజీనామా లేఖలో కంభంపాటి మాత్రం తన పలు విషయాలను స్పష్టం చేశారు. రానున్నది ఎన్నికల సంవత్సరమని తన లేఖలో గుర్తు చేసిన కంభంపాటి, యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతమని, వారికి అవకాశాల కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తన స్థానంలో ఓ యువకుడిని నియమించాలని కోరారు. నాలుగేళ్లపాటు తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు చెబుతూ, ప్రతి ఒక్కరినీ కలుపుకుని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని అన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles