UP cop suspended after audio clip goes viral బీజేపి నేతలతో డీల్ చేసుకో: రౌడిషీటర్ తో పోలీస్ అధికారి

Up cop suspended over leaked audio clip of encounter deal

UP cop suspended after audio clip goes viral, BJP, encounter, up planned encounter, Lekhraj Singh Yadav, Maunranipur police station SHO, Sunit Kumar Singh, UP Police, uttar pradesh

A senior police officer has been suspended in Uttar Pradesh after an audio clip of him allegedly striking a deal with a history-sheeter over a "planned encounter" went viral.

నెట్టింట్లో ఈ పోలీసు అధికారి ఆడియో క్లిప్ వైరల్, సప్పెన్షన్

Posted: 04/16/2018 01:05 PM IST
Up cop suspended over leaked audio clip of encounter deal

ఓ సీనియర్ పోలీసు అధికారిగా కొనసాగుతున్న వ్యక్తికి చెందినవిగా అభియోగించబడిన అడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో.. అతని ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి అధిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిష్టను కూడా మసకబారేలా చేసింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేసి పూర్తి ఘటనపై విచారణకు అదేశించారు. యోగీ అధిత్యనాత్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో ఏకంగా 1200లకు పైగా ఎన్ కౌంటర్లు జరగిన నేపథ్యంలో వీటిపై ఏకంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. దీంతో నేరస్థులను కొందరు కాపాడాలని చూస్తున్నారని సీఎం యోగీ అధిత్యనాథ్ అన్నారు.

అయితే ఈ నేపథ్యంలో పోలీసు అధికారికి చెందిన వీడియో క్లిప్ మాత్రం ప్రతిఫక్షాలకు అయుధంగా మారింది. బీజేపి నేతల మాటల వినని నేర చరిత్ర వున్నవాళ్లను టార్గెట్ చేసి.. వారిని బలవంతంగా బీజేపి నేతలతో డీల్ చేసుకోవాలని, లేదా ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరింపులు జరుగుతున్నాయంటూ విఫక్షాలు అరోపిస్తున్నాయి. ఇందుకు వెలుగులోకి వచ్చిన ఓ పోలీసు అధికారి అడియో క్లిప్ అధారంగా కూడా నిలుస్తుందని అరోపిస్తున్నారు. అయితే ఈ అరోపణలను పోలీసు ఉన్నాతాధికారులు, ప్రభుత్వం ఖండిస్తున్నా.. ప్రజల్లో మాత్రం ఏ మూలో చిన్న అనుమానం అయితే వుంది.

ఈ పోలీసు అధికారి అడియో క్లిప్ వివరాల్లోకి వెళ్తే... ఝాన్సీ జిల్లాలోని మౌరానీపూర్‌ కు చెందిన స్థానిక నేత లేఖ్‌ రాజ్‌ సింగ్‌ యాదవ్‌ పై 70 కేసులున్నాయి. దీంతో అరెస్టు అయిన ఆయన ప్రస్తుతం బెయిల్‌ పై బయట ఉన్నారు.  ఈ క్రమంలో ఆయనకు గత శుక్రవారం మౌరానీపూర్‌ ఎస్‌ హెచ్‌ఓ సునీత్‌ కుమార్‌ సింగ్‌ ఫోన్ చేసి, ‘ఎన్‌ కౌంటర్ల సీజన్‌ మొదలైంది. నీ మొబైల్‌ నంబర్‌ పై ఇప్పటికే నిఘాపెట్టాం. నువ్వు త్వరలో జరిగే ఎన్‌ కౌంటర్‌ లో చనిపోవచ్చు. ప్రాణాలతో ఉండాలనుకుంటే జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ దూబే, బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్‌ సింగ్‌ లతో ఒప్పందం చేసుకో అంటూ హెచ్చరించాడు.

అంతటితో అగకుండా డీల్ చేసుకోని పక్షంలో నీకు ఏ క్షణంలో అయినా ఏమైనా జరగొచ్చు... నేను నీకంటే చాలా పెద్ద నేరస్థుడిని, ఇప్పటికే చాలా మందిని చంపేశాను’. అంటూ హెచ్చరించారు. దానిని లేఖ్ రాజ్ సింగ్ యాదవ్‌ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ రోజు సాయంత్రం హర్‌ కరణ్‌ పురా గ్రామంలో రాజ్ సింగ్ దాక్కున్న ఇంటిని సునీత్‌ నేతృత్వంలోని పోలీసుల బృందం చుట్టుముట్టి కాల్పులు జరిపింది. ఆ కాల్పుల నుంచి తప్పించుకున్న రాజ్ సింగ్..తనతో ఎస్ హెచ్ఓ సునీత్ ఫోన్ లో మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇది వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh