Girl jumps-off from terrace to escape torture తండ్రి హింసను భరించని బాలిక ఏం చేసిందంటే..

Girl jumps off terrace as father beats her up mercilessly

torture, girl torture, suicide, Daughter beaten up, drunk father, Father beats daughter, Vijay Bagh area, Neemrana, Rajasthan, bihar, Violence, latest top news

A 12-year-old girl, Vandana, jumped from the terrace of a building to escape torture from father, who was beating her with chappal. The girl jumping from the building in Rajasthan state has gone viral.

ITEMVIDEOS: తండ్రి హింసను భరించని బాలిక ఏం చేసిందంటే..

Posted: 04/16/2018 11:56 AM IST
Girl jumps off terrace as father beats her up mercilessly

తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేని ఓ 12 సంవత్సరాల బాలిక ఏం చేసిందంటే.. తన తండ్రి నుంచి తప్పించుకునేందుకు మరణమే శరణమని భావించింది. పిల్లలు తెలిసో తెలియకో చేసే పనులు.. వల్ల తల్లిదండ్రలు ఎంతో మనోవేధనను అనుభవించాల్సి వస్తుంది. అయితే పిల్లలు తెలియక చేసే పనులను కూడా వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన తల్లిదండ్రులు.. వారు చేసే పనుల వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో చెప్పాల్సిందిపోయి.. తమ విచక్షణను కొల్పోయి.. పిల్లలపై తమ ప్రతాపాన్ని చూపితే.. జరిగేది ఎంటన్నది.. ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది.

కోపం చల్లారిన తరువాత తాను చేసిన పనికి కడుపుకోతే మిగిలింది అని జీవితాంతం బాధపడాల్సిన దారుణమైన భాద మాత్రం మిగలకూడదు. పిల్లలు తెలియక చేసినా.. తెలిసి చేసినా.. వారిని సముదాయించి.. సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి. అప్పటికే వినకపోతే మందలించాలే తప్ప.. తమ పిల్లలే కదా అని గొడ్డును బాదినట్లు బాదితే.. మిగిలే పరిణామాలు అత్యంత బాధాకరం. కోపంలో పిల్లల్ని చంపుకునే రాక్షసులుగా ఏ తల్లిదండ్రులు మారకూడదు. తమ పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు యమభట్టుల్లా కనబడితే.. నరకమే మేలన్న బావన కలుగుతుంది.

అలాంటి ఘటనే రాజస్తాన్ కలకలం రేపింది. బీహార్ నుంచి రాజస్థాన్ వచ్చి అక్కడే ఉద్యోగం చేసుకుంటున్న సంతోష్ కుటుంబం.. ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తుంది. వారి 12 ఏళ్ల అమ్మాయి వందన భవంతిపైకి ఎక్కి సెల్ ఫోన్ మాట్లాడుతుంది. అదే సమయంలో భవంతిపైకి వచ్చిన తండ్రి సంతోస్.. సెల్ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావ్.. అయినా ఇంత రహస్యంగా వచ్చి మాట్లాడాల్సిన అవసరమేంటి.? అన్న అనుమానంతో వందనను కొట్టాడు. అప్పటికీ తన కోపం చల్లారలేదు. దీంతో ఎదుగుతున్న అమ్మాయి అని కూడా చూడకుండా అమెను చెప్పుతో కొట్టాడు.

ఇలా పదే పదే కొట్టడంతో.. తన తండ్రి హింస నుంచి తప్పించుకునేందుకు వందన భవంతి టెర్రెస్ పై నుంచి కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాగా, స్థానికులు హుటాహుటిన అమెను ఆసుపత్రికి తరలించారు. వందన రెండు కాళ్లు ప్రాక్చర్లు అయ్యాయి. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే వుందని, కొలుకుంటుందని వైద్యులు చెప్పారు. ఇరుగుపోరుగువారు బాలికను సంతోష్ కుమార్ కొడుతున్న సమయం నుంచి పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించినా అక్కడి ల్యాండ్ లైన్ పనిచేయలేదు. ఇక సెల్ పోన్లకు ప్రయత్రించినా.. వారు స్పందించలేదు. మీడియా ప్రతినిధులకు ఘటన విషయం తెలిసి వచ్చినా.. పోలీసులు మాత్రం రాలేదు. ఇక కేవలం 7 కిలోమీటర్ల దూరం వున్న ప్రాంతానికి పోలీసులు చేరుకునేందుకు ఏకంగా మూడు గంటల సమయం పట్టింది. ఎట్టకేలకు వచ్చిన పోలీసులు, సంతోష్ ను అరెస్ట్ చేశారు. కుమార్తెను హింసించిన నేరానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : torture  girl torture  suicide  Daughter  drunk father  Father beats daughter  Rajasthan  bihar  Violence  

Other Articles

Today on Telugu Wishesh