Punjabi singer Parmish Verma shot at in Mohali ప్రముఖ పాప్ సింగర్ పై కాల్పులు..

Punjabi singer parmish verma hospitalised after being shot in mohali

Bollywood, Chandigarh, Mohali, Parmish Verma, Punjab, Punjabi singer, Punjabi singer shot, Fortis Hospital, Gaal ni kadni, Punjabi music, guns in Punjab, Punjabi films, Singham

Famous Punjabi singer Parmish Verma and a friend, identified as Kulwant Singh, were shot on the intervening night of Friday and Saturday at the entrance of Sector 74, Mohali.

ప్రముఖ పాప్ సింగర్ పర్మిష్ వర్మపై కాల్పులు..

Posted: 04/14/2018 03:31 PM IST
Punjabi singer parmish verma hospitalised after being shot in mohali

‘గాల్ నహీన్ కదానే’ పాటతో పాప్యులర్ అయిన ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ పర్మిష్‌ వర్మపై హత్యాయత్నం జరిగింది. తన స్నేహితుడు కుల్వంత్ సింగ్ తో కలసి సెక్టార్ 74 వద్ద నిలబడి వుండగా, గుర్తుతెలియని దుండగులు హఠాత్తుగా వచ్చి ఆయనపై కాల్పులు జరపడం పంజాబ్ లో కలకలం రేపుతోంది. ఈ కాల్పుల ఘటనలో పర్మిష్ వర్మాతో పాటు కుల్వంత్ సింగ్ కూడా బుల్లెట్ గాయాలయ్యాయయి.

కాగా పర్మిష్ సింగ్ తో పాటు అతని స్నేహితుడు కూడా కొలుకుంటున్నారని, వైద్యులు తెలిపారు. అర్థరాత్రి వేళ కూడా మోహాలీలని సెక్టార్ 74లోని స్థానికులు హుటాహుటిన స్పందించి క్షతగాత్రులైన పర్మిష్ వర్మతో పాటు కుల్వంత్ సింగ్ లను మోహాలిలోని ఫోర్టిస్ అస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో పర్మిష్ వర్మ మోకాలికి గాయమైందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిన్న రాత్రి మొహాలిలోని తన ఇంటికి పర్మిష్ వర్మ తన స్నేహితుడితో కలసి ఎలంటీ మాల్ కు వెళ్లి తిరిగి ఇంటికి తిరుగుపయనం అవుతుండగా, సెక్టర్‌ 74 సమీపంలోకి వచ్చేసరికి ఆయనపై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. అయితే తాజాగా విడుదలైన ఆయన గాల్ ని కాదని పాట యూట్యూబ్ లో 11 కోట్ల 80 లక్షల సార్లు ప్రేక్షకులు వీక్షించారంటే అయన సాధించిన పాపులారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో ఆయనకు పెరుగుతున్న పాపులారిటీ పంజాబ్ లోని స్థానిక గ్యాంగ్ స్టర్లకు మింగుడుపడక ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తుంది.ఇక తాజాగా ఆయన పాడిన సింగిల్ షాదా పాట కూడా పాపులర్ అయ్యింది. అ పాటను కూడా ఏకంగా 2 కోట్ల 70 లక్షల మంది ప్రేక్షకులు వీక్షించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles