Telangana Inter results; girls outperform boys తెలంగాణ ఇంటర్ ఫలితాలలో బాలికల హవా..

Telangana inter 1st 2nd year results declared girls outperform boys

telangana inter results, telangana inter results 2nd year, telangana inter results 2018, telangana inter results 2018 2nd year, telangana results, telangana class 12 results, board of intermediate education telangana, bieap, bieap result, telangana inter results 2018 manbandi, telangana inter results 2018 date

The Telangana education minister and chairman of Telangana State Board of Intermediate Education, Kadiyam Srihari, declared the results of the Telangana State Board of Intermediate Education (TBIE) Intermediate first year results today.

తెలంగాణ ఇంటర్ ఫలితాలలో బాలికల హవా..

Posted: 04/13/2018 10:20 AM IST
Telangana inter 1st 2nd year results declared girls outperform boys

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో బాలికలు తమ హావాను కొనసాగించారు. రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి ఇవాళ ఉదయం ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు 4,55,789 మంది విద్యార్థులు రాయగా.. 2,84,224 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. అలాగే ఇంటర్‌ సెకండియర్లో 4,29,378 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,88,772 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. కాగా... ఇంటర్‌ ఫస్టియర్లో 62.35శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఇంటర్‌ సెకండియర్‌లో 67.25శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.

ఇదిలా ఉండగా ఇంటర్‌ సెకండియర్ మేడ్చల్, కుమరంభీమ్ జిల్లాలు 85శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలువగా, రెండవ స్థానంలో 77శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా ఉంది. చివరి స్థానంలో మహబూబాబాద్‌ జిల్లా(40శాతం) ఉంది. అలాగే ఇంటర్‌ ఫస్టియర్లో మేడ్చల్‌ జిల్లాకు తొలిస్థానం లభించగా రంగారెడ్డి జిల్లాకు రెండోస్థానం దక్కింది. మే 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.  గత ఏడాదితో పోల్చితే ఈసారి ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. రీకౌంటింగ్‌కు ఈనెల 20వరకు గడువు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

ఇంటర్ ఫలితాల కోసం ఈ కింద్రి లింకులను క్లిక్ చేయండి.

Manabadi.co.in

Results.cgg.gov.in

Bie.telangana.gov.in

Tsbie.cgg.gov.in

Examresults.net

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles