krishna tops first and kadapa last in second year inter results ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో కృష్ణా ఫస్ట్, కడప లాస్ట్

Krishna tops first and kadapa last in second year inter results

ap inter results, ap inter results 2nd year, ap inter results 2018, ap inter results 2018 2nd year, ap results, ap class 12 results, board of intermediate education andhra pradesh, bieap, bieap result, ap inter results 2018 manbandi, ap inter results 2018 date

Andhra pradesh second year intermiediate results released by minister ganta srinivasa rao, overall pass percentage is 73.33 in which girls stood on top than boys.

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో కృష్ణా ఫస్ట్, కడప లాస్ట్

Posted: 04/12/2018 03:17 PM IST
Krishna tops first and kadapa last in second year inter results

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాజమహేంద్రవరంలోని షల్టన్‌ హోటల్‌‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. అత్యల్ప ఉత్తీర్ణత శాతంతో కడప జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. 77 శాతంతో నెల్లూరు జిల్లా రెండవ స్థానంలో, 76 శాతంతో మూడవ స్థానంలో గుంటూరు జిల్లా నిలువగా, 56శాతంతో కడప జిల్లా అఖరుస్థానంలో నిలిచింది.

సెకండియర్ ఫలితాల సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. పరీక్షలు పూరైన కేవలం 24 రోజుల వ్యవధిలోనే పలితాలను రికార్డు సమయంలో విడుదల చేస్తున్నామన్నారు. విద్యార్థులు అందరూ తమ ఫలితాలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 44 వెబ్ సైట్లలో ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. అయితే ఇంటర్ ఫలితాలలో రోటిన్ మాదిరిగా బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. బైపీసీలో టాప్ మూడు ర్యాంకులను బాలికలే సాధించారని వివరించారు. మొత్తం 4,84,889 మంది విద్యార్థులు రాశారని, ఇందులో రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని అన్నారు.

ఈ ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణతా శాతం 73.33 శాతం నమోదు కాగా, బాలికలే ఈ సారి కూడా అధిక ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు. ఎంపీసీ లో కూనం తేజవర్థన్ రెడ్డి 992 మార్కులతో స్టేట్ ఫస్ట్ గా నిలిచాడని మంత్రి వెల్లడించారు. ఇక రెండో స్థానంలో అఫ్రాన్ షేక్ నిలువగా, మూడో స్థానంలో వాయిలపల్లి సుష్మ నిలిచిందని మంత్రి ప్రకటించారు. బైపీసీలో ముక్కు దీక్షిత 990 మార్కులతో రాష్ట్రంలోనే ఫస్ట్ల్ ర్యాంకు సాధించిందని మంత్రి వెల్లడించారు. రెండో స్థానంలో రపనేని లక్ష్మీ కీర్తి నిలించిదన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి ఈనెల 21వ తేదీలోగా ఫీజు చెల్లించాలన్నారు. మే 14న పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles