civil court orders on PSV Garuda Vega గరుడ వేగ ప్రదర్శనపై న్యాయస్థానం అదేశాలు..

Don t screen psv garuda vega orders city civil court

hyderabad civil court, city civil court, film producers, directors, Youtube, social media, 'PSV Garuda Vega', hero Rajashekar, illegal transportation, nuclear raw material, India, North Korea, Uranium corporation, Upparapally

The city civil court has ordered film producers, directors and Youtube not to screen 'PSV Garuda Vega', a thriller film starring hero Rajashekar. The court also said that the film should not be uploaded on any social media platforms.

గరుడ వేగ ప్రదర్శనపై న్యాయస్థానం సంచలన అదేశాలు..

Posted: 04/12/2018 10:54 AM IST
Don t screen psv garuda vega orders city civil court

అంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరొందిన టాలీవుడ్ హీరో రాజశేఖర్‌ నటించిన చిత్రం పీఎస్వీ గరుడ వేగ చిత్రం అయనకు తాజా హిట్ ఇచ్చి.. తన కెరీర్ ను మళ్లీ చిగురింపజేసింది. అయితే ఈ చిత్రంపై తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘గరుడ వేగ’ చిత్రానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రదర్శనలు ఉండరాదని సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన అదేశాల సారాంశం. టీవీల్లోగానీ, యూట్యూబ్‌ సహా ఎలాంటి సామాజిక మాద్యమాల్లో కానీ ఈ చిత్రాన్ని ప్రదర్శించరాదని, కనీసం పోస్టులు కూడా చేయరాదని అదేశాల్లో పేర్కోంది.

ఈ చిత్రానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు, ప్రెస్ మీట్ లు నిర్వహించరాదంటూ నిర్మాతలు, దర్శకుడితోపాటు యూట్యూబ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని, దీని ప్రదర్శనలను నిలిపివేయాలంటూ హైదరాబాద్ ఉప్పరపల్లిలోని అటమిక్‌ ఎనర్జీ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సిటీ సివిల్ కోర్టు 4వ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.శ్రీహర్షారెడ్డి వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు.

శ్రీహర్షారెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తై.. ఈ చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన స్కాం గురించి ఉందన్నారు. యురేనియం స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్‌, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించారని, ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ గా హీరో స్కాంను బట్టబయలు చేస్తున్నట్లు చూపారన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. వాదనలను విన్న జడ్జి పిటిషనర్‌ వాదనలతో ఏకీభవిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్ మీట్ లు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles