police home guards gesture towards social responsibility హ్యాట్సాఫ్: కాకీ కాఠీన్యం వెనుక కరుణ, ఔదర్యం..

Police home guards gesture towards social responsibility

kukatpally traffic police, home guards, old woman, jntu, gopal, jhangir, missing little girl, parents, cyberabad police, commissioner sajjanar, trending news

The kukatpally traffic police home guards gesture towards social responsibilty one feeds old homeless woman and another carefully handovers the missing child to her parents

హ్యాట్సాఫ్: కాకీ కాఠీన్యం వెనుక కరుణ, ఔదర్యం..

Posted: 04/02/2018 05:39 PM IST
Police home guards gesture towards social responsibility

పోలీసుల కాకీ దుస్తులతో పాటు కాఠిన్యం వుంటుందని, వారు ఒకంతకు చెలించరన్న విమర్శలు ఇప్పటికే ప్రచుర్యలో వున్న నేపథ్యంలో ఆ కాకీ దుస్తుల మాటు వారిలో వున్న కరుణ, ఔదార్యం ఎంతటివో చూపుతున్నారు ఈ ఇద్దరు పోలీసులు. కూకట్ పల్లి ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ ఇద్దరు హోంగార్డులు.. తమ ఔదర్యాన్ని చాటుకుని స్థానికులతో పాటు ఇటు పోలీసుల బాస్ ల మన్నన్నలను అటు సోషల్ మీడియాలో నెట్ జనుల ప్రశంసలను అందుకున్నారు. ఒకరేమో వృద్ధురాలికి ఆల్పాహారం తినిపిస్తే మరొకరు తప్పిపోయిన చిన్నారిని చేరదీసి.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ కు చెందిన బుచ్చమ్మ(75) ..కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి దగ్గర బిక్షాటన చేస్తూ కాలం గడుపుతుంది. ఆదివారం రోజున ఆకలితో అలమటిస్తూ దీనంగా అందరివైపు చూస్తున్నా ఆ అవ్వను దీనస్థితిని చూసి చలించిపోయిన బి.గోపాల్ అమెను వివరాలు అడిగే ప్రయత్నం చేశాడు. అయితే తనకు తిండికి కూడా డబ్బులు ఇవ్వకుండా తన కొడుకు ఎత్తుకెళ్లాడని తెలుసుకున్న గోపాల్ అమెకు అల్పాహారం తెప్పించి తినిపించాడు. ఇది గమనించిన అటుగా వెళ్తున్న హర్షా భార్గవి..  అనే మహిళ.. దానిని ఫోటో తీసి నెట్ లో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

మరో ఘటనలో అదివారం ఉదయం పూట జాతీయ రహదారిలో రోడ్డుమధ్యలో ఓ చిన్నారి నిల్చొని ఉండటం గమినించిన ఎండీ.జహంగీర్‌ అనే హోంగార్డు.. చిన్నారి వద్దకి వెళ్లి మంచినీళ్లు తాగించి ఆమె పేరు, తల్లిదండ్రుల వివరాలు తెలుసుకునేందుకు విఫలయత్నం చేశాడు. జహంగీర్‌ ఆ చిన్నారి కుటుంబసభ్యుల కోసం స్థానికంగా సర్వీస్ రోడ్డు, రైతుబజారు, నిజాంపేట ప్రాంతాల్లో వేతికినా లాభంలేకపోయింది. దీంతో పాపను తనతోనే కూడలి వద్ద కూర్చోబెట్టి అల్పాహారం అందించారు. పాప సమాచారం తెలుసుకుని చిన్నారి తల్లిదండ్రులు రావడంతో వారికి అప్పగించి స్థానికుల నుంచి మనన్నలను అందుకున్నాడు. విషయం తెలుసుకున్న సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హోంగార్డు జహంగీర్‌కు ఫోన్‌చేసి ప్రశంసించారు. జహంగీర్‌ తన విధులతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో కూకట్‌పల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పలు స్వచ్ఛందసంస్థలు ఇప్పటికే ఆరుసార్లు ఆయన్ను సన్మానించి అభినందించాయి.

* ట్రాఫిక్‌ రికవరీ వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తున్న బి.గోపాల్‌ మూడురోజులుగా జాతీయరహదారితో పాటు జేఎన్‌టీయూ చౌరస్తా, ఫొరంమాల్‌ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో జేఎన్‌టీయూ చౌరస్తాలో ఓ వృద్ధురాలు రోడ్డుపక్కన అచేతనంగా ఉండటం గమనించారు. ఆదివారం ఉదయం గోపాల్‌ ఆమె వద్దకి వెళ్లి కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. భిక్షాటన చేస్తూ కూడబెట్టుకున్న నగదును తన కొడుకు తీసుకుని ఖర్చుపెడుతున్నాడని, తనకి ఆహారం కూడా లేకుండా పోతుందని ఆమె తన ఆవేదనను తెలిపింది. దీంతో గోపాల్‌ చలించిపోయి అప్పటికప్పుడు అల్పాహారం తీసుకవచ్చి ఆ వృద్ధురాలికి తినిపించి కొంత నగదును ఆమెకి ఇచ్చారు. అతడిని స్థానికులు అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles