SBI reported Nathella Sampath as fraud accounts ఎస్బీఐకి నాథేళ్ల సంపత్ జ్యూవెలరీ.. రూ.215 కోట్లకు కుచ్చుటోపి

Sbi informs cbi over 250 crore fraud by nathella sampath jewelry

SBI, nathella sampath jewellery, loan, Chennai, Kanishk gold, gold chit fund scheme, monthly installments, CBI, crime

State Bank of India said it has lodged a complaint with the CBI over a 250 crore fraud by Chennai-based jewellery chain Nathella Sampath Jewelry Pvt Ltd.

ఎస్బీఐకి నాథేళ్ల సంపత్ జ్యూవెలరీ.. రూ.215 కోట్లకు కుచ్చుటోపి

Posted: 03/24/2018 04:04 PM IST
Sbi informs cbi over 250 crore fraud by nathella sampath jewelry

తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలు క్రమంగా బ్యాంకులకు కుచ్చుటోపి పెడుతున్నాయి. కనిష్క్ గోల్డ్ సంస్థ ఎస్బీఐకి ఎగనామం పెట్టిన రెండు రోజుల వ్యవధిలోనే మరో బంగారు వ్యాపార సంస్థ కూడా అదే బాటలో నడిచిందని ఎస్టీఐ సీబిఐకి పిర్యాదు చేసింది. గత ఏడాది తమ వద్ద భారీ మొత్తంలో రుణాలు పోందిన వారిలో కనిష్క్, ఆ తరువాత నాదెళ్ల సంపత్‌ జ్యూయలరీ సంస్థలు నకలీ అకౌంట్లకు పాల్పడ్డాయని పిర్యాదు చేసింది. కనిష్క్ గోల్డ్ సంస్థకు చెందిన యజమానులను అరెస్టు చేసిన రోజునే ఈ వివరాలు బయటికి వెల్లడయ్యాయి.

కాగా నాదేళ్ల సంపత్ జ్యూవెలరీ సంస్థ తమ వద్ద నకిలీ దస్తావేజులతో పెట్టి రూ.250 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిందని ఎస్బీఐ అధికారులు సీబిఐకి పిర్యాదు చేశారు. రుణం పోందిన 2010 నుంచి జ్యూయలరీ సంస్థ రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో నోటీసులను పంపినా వాటికి సరైన బదులు కూడా కరువైయ్యిందని ఎస్బీఐ పేర్కొంది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని అశ్రయించిన ఎస్బీఐ అధికారులు ఇటీవలే ఈ సంస్థపై ఫిర్యాదు చేశారు.

కాగా, నాథేళ్ల సంపత్ జ్యూవెలరీ సంస్థ చెన్నై శివారల్లోని తమ శాఖలను మూసివేయించడంతో కస్టమర్లు అందోళన చెందారు. సుమారు వెయ్యి మందికిపైగా కస్టమర్లు ఈ సంస్థపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జ్యూయలరీ సంస్థ బోర్డు మెంబర్స్ ఎండీ. రంగనాథ గుప్తాపైన, ఆయన కుమారులపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంస్థను అర్థికపరమైన కష్టాలను ఎదుర్కొంటుందని, అందుచేతే శాఖలను మూసివేసిందని తెలిపారు.

అయితే కస్టమర్లకు ఏమీటీ అవసరం అంటారా..?  ఈ సంస్థ అకర్షనీయంగా తయారు చేసిన బ్రోచర్ చూసిన దాదాపు 21వేలకు పైగా కస్టమర్లు..గత సంవత్సరం నవంబర్ నుంచి  75 కోట్ల రూపాయల వరకు బంగారం కొనుగోలు కోసం నెలవారీ సులభ వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు. శాఖలను మూసివేయడంతో తమ డబ్బు వస్తుందా..? రాదా.?. అన్న అందోళన చెందిన కస్టమర్లు పోలీసులకు పిర్యాదు చేశారు. కాగా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో శాఖలున్న ఈ జ్యుయలరీ సంస్థ 2017 అక్టోబరులోనే దివాలా తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles