cpi ramakrishna slams CM kcr on AP special status కేసీఆర్ పై సీపీై రామకృష్ణ ఘాటు విమర్శలు

Cpi ramakrishna slams cm kcr on ap special status

CPI, Ramakrishna, KCR, TRS, K.chandra shekar Rao, Telangana CM, shikandi, Andhra pradesh special status, ruling party, TDP, chandrababu, state bifurcation bill promises, YS jagan, Pawan Kalyan, JanaSena, andhra pradesh, politics

After Telangana ruling party which demands for reservations for minorities in parliament creates logjam for about a week and stands as an obstacle for discussion on Andhra pradesh special status in both houses.

కేసీఆర్ పై సీపీఐ రామకృష్ణ ఘాటు విమర్శలు

Posted: 03/24/2018 10:55 AM IST
Cpi ramakrishna slams cm kcr on ap special status

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో వరుసగా అరు రోజుల నుంచి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుండగా, ఆ అంశాన్ని చర్చకు రానీయకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సైంధవుడిలా అడ్డుకుంటున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటు విమర్శలు చేశారు.

తెలంగాణలోని టీఆర్ఎస్, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలు ఆంధ్రప్రదేశ్ పాలిట శిఖండి పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు. నాడు మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయేందుకు పోట్టి శ్రీరాములు ప్రాణాలను బలి తీసుకున్న తమిళనాడు.. హైదరాబాద్ నుంచి అసంబద్దంగా గెంట్టివేత గురైన నేపథ్యంలో రాష్ట్ర అమాయక యువత ప్రాణాలను బలిగొన్న తెలంగాణ.. కలసి ఇప్పుడు మరోమారు అంధ్రప్రదేశ్ పై కక్ష సాధిస్తున్నాయని  రామకృష్ణ విమర్శించారు.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేసీఆర్ పై ఏపీ ప్రజలు ప్రేమను పెంచుకున్నా.. ఆయన మాత్రం వారి పాలిట సైందవుడిలా అడ్డుపడుతున్నారని అన్నారు. కేంద్రంపై ఫెడరల్ ఫ్రంట్ తో  పోరాటం అంటున్న కేసీఆర్ మాటల్లో నిజంగా చిత్తశుద్ది వుంటే అవిశ్వాసానికి ఆయన సహకరించాలని డిమాండ్ చేశారు. నంగనాచి మాటలు చెబుతున్న కేసీఆర్, బీజేపీతో లాలూచీ పడ్డారని, మోదీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ఈ నెల 27న అంబేద్కర్ విగ్రహాల వద్ద రాజ్యాంగ పరిరక్షణ దినం పాటిస్తామని రామకృష్ణ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CPI  Ramakrishna  KCR  TRS  Telangana CM  andhra pradesh  politics  

Other Articles