Congress to Move No Trust vote against BJP ఇకపై కాంగ్రెస్ వంతు.. మోడీ సర్కార్ పై అవిశ్వాసం..

Congress to move no confidence motion against modi government

Congress, no confidence motion, mallikarjun kharge, lok sabha speaker, sumitra mahajan, bank scam, rafell scam, ap special status, TDP, YCP, BJP, PM Modi, Amit shah, chandrababu, state bifurcation bill promises, YS jagan, andhra pradesh, politics

Congress to Move No-confidence Motion Against BJP-led Central Government. Leader of Opposition in the Lok Sabha, Mallikarjun Kharge, has written a letter to the Speaker of the House, notifying that the party plans to move a no-confidence motion.

ఇకపై కాంగ్రెస్ వంతు.. మోడీ సర్కార్ పై అవిశ్వాసం..

Posted: 03/23/2018 07:51 PM IST
Congress to move no confidence motion against modi government

ఆంధ్రప్రదేశ్ లోని అధికార, విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాలపై గత ఆరు రోజులుగా పార్లమెంటు ఉభయసభల్లో చర్చకు నోచుకోకుండా పోయిన తరుణంలో ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుంది. ఆంధ్రప్రదేశ్  కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలన్నింటినీ ఏకం చేస్తుంది కాంగ్రెస్. దీంతో తానే స్వయంగా తానే స్వయంగా రంగంలోకి దిగింది.

ఈ మేరకు ఆ పార్టీ లోక్ సభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కార్యాలయానికి పంపారు. మంగళవారం సభా కార్యకలాపాలకు సంబంధించిన జాబితాలో తమ అవిశ్వాస నోటీసును చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఖర్గేను కలిసి వైసీపీ సభ్యులు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని లోక్ సభ కారిడార్ లో కలిసి కోరడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చే ముందు తమ మద్దతు కోరాల్సింది పోయి వారం రోజుల తరువాత సపోర్టు చేయడమనడం ఆయను అసంతృప్తికి గురిచేసింది.

కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా కలిసి చర్చించాక ఖర్గే కార్యాలయం నుంచి అవిశ్వాస నోటీసును స్పీకర్ సుమిత్రా మహజన్‌ కార్యాలయానికి పంపారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, రోజుకో బ్యాంకు కుంభకోణం వెలుగుచూస్తోందని, రాఫెల్‌ విమానాల కొనుగోళ్లలో అక్రమాల సహా అనేక అంశాలపై చర్చ జరగాల్సి వుందని పేర్కోన్నారు. తాము పెట్టిన తీర్మానాన్ని మంగళవారం సభా కార్యకలాపాల జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. ఇందుకోసం సభను సజావుగా సాగేలా చూడాలని స్పీకర్‌ను కోరనున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  no confidence motion  mallikarjun kharge  chandrababu  andhra pradesh  politics  

Other Articles