After PNB, SBI, now Union Bank of India hit by bank fraud పీఎన్బీ, ఎస్బీఐ బాటలో యూబిఐ.. రూ.1394 కోట్ల కుంభకోణం

1394 crore bank fraud case on union bank of india complaint

India, bank fraud, Totem Infrastructure, Union Bank of India, CBI, Bank frauds in India, PNB fraud, SBI, Kanishk Gold, Banking in India

Yet another bank fraud has come to light, with the CBI filing a case against Hyderabad-based Totem Infrastructure Ltd for allegedly defrauding a consortium of eight banks led by Union Bank of India (UBI) to the tune of Rs. 1,394 crore.

పీఎన్బీ, ఎస్బీఐ బాటలో యూబిఐ.. రూ.1394 కోట్ల కుంభకోణం

Posted: 03/23/2018 09:31 AM IST
1394 crore bank fraud case on union bank of india complaint

పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ అఫ్ బాటలో మరో బ్యాంకు కూడా నడించింది. ఇన్నాళ్లు అటు ముంబై, ఇటు చెన్నై సహా దేశంలోని పలు బ్యాంకుల్లో వెలుగుచూసిన కుంభకోణాలు తాజాగా మన హైదరాబాద్‌ లో కూడా వెలుగుచూశాయి. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ శాఖకు చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1394 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూడడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌ కు చెందిన టొటెం ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే నిర్మాణ సంస్థ ఈ కుంభకోణానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళ్తే... టొటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 1997లో హర్యానాలోని గుడ్‌ గావ్‌ కేంద్రంగా ఏర్పాటైంది. దీనికి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా తొట్టెంపూడి సలలిత్‌ వ్యవహరిస్తున్నారు. టొటెం సంస్థ హైదరాబాద్ లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఏకంగా రూ.314 కోట్లను తీసుకోగా, ఇదే లీడ్‌ బ్యాంక్‌ గా ఉన్న ఎనిమిది బ్యాంకుల కన్సార్టియం నుంచి 1394 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. తీసుకున్న రుణం మొత్తాన్ని వేరే బ్యాంకుల్లో ఖాతాలు తెరచి వాటిల్లో జమచేశారు. ఇలా మార్చడానికి భారీ ఖర్చులను సాకుగా చూపారు.

ఇక రుణాలు పొందిన తరువాత తిరిగి చెల్లింపులు చేయకుండా టొటెం సంస్థ చేతులెత్తేసింది. బ్యాంకు అధికారులు నోటీసులు పంపి.. చివరకు 2012 జూన్‌ 30న వీటిని వసూలు కాని మొండి బకాయిలుగా రైట్ అఫ్ చేశారు. అనంతరం ఈ సంస్థ లావాదేవీలన్నీ కన్సార్టియంలో ఉన్న 8 బ్యాంకుల్లో కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా నిర్వహించినట్టు ఆడిట్ అధికారులు గుర్తించారు. దీంతో సీబీఐకి యూబీఐ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సీబీఐ, హైదరాబాదులోని టొటెం సంస్థ కార్యాలయంతో పాటు డైరెక్టర్లు సలలిత్‌, లలిత ఇళ్లల్లో సోదాలు నిర్వహించి ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  bank fraud  Totem Infrastructure  Union Bank of India  CBI  

Other Articles