banks not accepting exchange of torn currency notes కరెన్సీ నోటు.. కొంచెం చిరిగినా జేబుకు చిల్లు.!

Banks not accepting exchange of torn or soiled currency notes

currency note, notes exchange, RS 2000 note, torn, soiled, mutilated, demonetisation, Remonetisation, Rs 500, Rs 200, Banks, Reserve bank of India, PM Modi, Parliament

Exchange of damaged currency is covered under Note Refund Rules 2009. An amendment to the rules to include the new currency is yet to be approved by the parliament. current rules do not allow for exchange of torn or soiled currency notes,

సామాన్యుడికి కరెన్సీ కష్టం.. కొంచెం చిరిగినా జేబుకు చిల్లు.!

Posted: 03/22/2018 11:51 AM IST
Banks not accepting exchange of torn or soiled currency notes

దేశంలో అవినీతి, అక్రమాలు, నల్లధనం, ఉగ్రవాద, మావోయిజాన్ని అణిచివేయాలంటే పెద్దనోట్ల రద్దు లాంటి సాహసోపేత నిర్ణయం తప్పనిసరి అని ప్రకటించిన వెంటనే దానిని 2016 నవంబర్ 8 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం.. అప్పటి నుంచి సామాన్యుడికి కష్టాలకడలిలోనే నిత్యం ఇబ్బందులు పడేలా చేస్తుంది. పాత పెద్ద నోట్ల స్థానంలో కొత్తగా రూ. 500 నోటుతో పాటు మునుపెన్నడూ లేనంత పెద్దనోటు రూ.2000లను కూడా చెలామనిలోకి తీసుకువచ్చింది. దీంతో పాటు కొత్తగా రూ. 200, రూ.50 కొత్త నోట్లకు కూడా తీసుకువచ్చింది.

ఇలా నోట్లను ప్రవేశపెట్టిన సందర్భంలో ఈ నోట్ల నాణ్యత, భద్రతా పరిణామాలపై అనేక సందేహాలు, అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. ఇందుకు కారణం అర్బీఐ చల్లగా వెలువరించిన ఓ ప్రకటనే కారణం. కొత్తగా కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నోట్లపై ఎలాంటి రాతలు రాసినా అవి చెల్లవని.. దీంతో పాటు ఆ నోట్లు కొంచెం చిరిగినా కూడా చెలామణి కావని చెప్పింది. దీంతో ఆ నోట్లను భద్రంగా దాచుకునేందుకు సామాన్యుడికి కష్టాలు పడాల్సి వస్తుంది. అటు వర్షాకాలంలో మాత్రం మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇప్పటికే నోట్ల రద్దు తరువాత ఉత్పన్నమైన పరిణామాల నేపథ్యంలో కరెన్సీ కష్టాలను భాధ ఎలాంటిదో.. బ్యాంకుల ముందు బారులతో, ఏటీయం కేంద్రాలకు నో క్యాష్ బోర్డులతో.. రుచి చూపించిన కేంద్రం అంటే మండిపడతున్న సామాన్యుడు.. ఇక మన డబ్బును మనం తీసుకోవడానికి కూడా షరుతులు పెట్టి.. ఇంతే ఇస్తామని బ్యాంకు అధికారులు సమాధానలతో విసిగివేసారినా గత్యంతరం లేని పరిస్థితులను కూడా సర్థుకుపోయాడు. అయితే రిఫండ్ రూల్స్ ఎలా ఉండాలన్న విషయమై, అర్బీఐ ఎటువంటి విధి విధానాలనూ జారీ చేయకపోవడంతో, కరెన్సీ నోటు కొంచెం చిరిగినా సామాన్యులకు శఠగోపం పడుతుంది.

తమ వద్ద వున్న నోట్టు కొద్దిగా చిరిగాయని.. వాటిని తీసుకుని వేరే కొత్త నోట్లు జారీ చేయాలని ప్రతినిత్యం వందలాది మంది బాధితులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో రంగు వెలసిన, లేక రాతలు రాసిన కారణాలతో చెలమాణిలో లేకుండా పోయిన.. రెండు నోట్లు మాత్రమే ఒక్క వ్యక్తి నుంచి తీసుకుని వాటి స్థానంలో మరో నోట్లు ఇవ్వచ్చని చెప్పిన అర్బీఐ అదేశాలు ఇచ్చింది. అయితే ఈ అదేశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నుంచి తమకు సూచనలు ఉన్నట్టు బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

2016 నవంబర్ 10న కొత్త నోట్లు చెలమణిలోకి వచ్చాయి. దీంతో 16 నెలలు కాలక్రమంలో కొన్ని సందర్భాలలో కరెన్సీ నోట్లు ప్రజల చేతుల్లో అనుకోకుండా చిరిగిపోతున్నాయి. ఇక మరికొన్ని సందర్భాలలో ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేయగా, చిరిగిన నోట్లే వస్తున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. అయితే ఈ నోట్లను తీసుకోవాలన్న అదేశాలు తమకు అందలేదని, అంత అత్యవసరమైన పరిస్థితుల్లో ఆర్బీఐ  ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి మార్చుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. లేదంటే అర్బీఐ అదేశాలు వచ్చేవరకు వాటిని జాగ్రత్తగా దాచాలని కూడా చెబుతున్నారు. అయితే ఇదే అదనుగా.. 30 నుంచి 40 శాతం కమీషన్ తో దళారులు ఆ నోట్లను తీసుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : currency note  notes exchange  RS 2000 note  torn  soiled  mutilated  demonetisation  Reserve bank of India  

Other Articles