janasena supports highway blockage agitation రహదారుల దిగ్భంధనానికి జనసేన మద్దతు

Janasena supports highway blockage agitation

pawan kalyan, APSP, TDP, YSRCP, no confidence motion, TRS, AiADMK, BJP, lok sabha, rajya sabha, highways, janasena, congress, ysrcp, cpi, cpm, Andhra pradesh special status, congress, andhra pradesh, politics

janasena party gives support to agitation programme demanding special status to andhra pradesh in blockages of highway and black flag protest throughout the state.

రహదారుల దిగ్భంధనానికి జనసేన మద్దతు

Posted: 03/21/2018 06:58 PM IST
Janasena supports highway blockage agitation

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన జాతీయ రహదారుల దిగ్భంధనం విసృత్తంగా జరిగే అవకాశాలే కనబడుతున్నాయి. అధికారికంగా రేపు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే నిర్వహించాలని తలపెట్టిన ఈ అందోళన కార్యక్రమం రాష్ట్రంలోని పలు చోట్ల సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలే వున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని యువతలో బలంగా నాటుకుపోవడమే ఇందుకు కారణంగా మారనుందని సమాచారం.

జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధనం కార్యక్రమంతో నిరసన తెలిపే కార్యక్రమాలకు వామపక్షాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కాగా, ఈ అందోళన కార్యక్రమానికి జనసేన పార్టీ కూడా మద్దతు పలికింది. తమ పార్టీ కార్యకర్తలు కూడా గురువారం అంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందోళనలో పాల్గోంటారని తెలిపింది. కాగా, తమ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో అన్ని ప్రధాన కూడళ్ల వద్ద మౌన ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, వైసీపీ రేపటి ఆందోళనకు మద్దతు ఇచ్చాయి. ఈ విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టకుండా కుట్రలు పన్నుతోందని అన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని వామపక్ష నేతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Adhra pradesh special status  highways  janasena  congress  ysrcp  cpi  cpm  andhra pradesh  politics  

Other Articles